ఇరాన్‌తో యుధ్ధం.. అత్యంత వినాశనకరం.. ఇమ్రాన్ ఖాన్

| Edited By: Ravi Kiran

Jan 23, 2020 | 12:55 PM

ఇరాన్‌తో యుధ్ధంవల్ల తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన ఆయన ట్రంప్‌తో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్-అమెరికా మధ్య సాయుధ పోరాటమే జరిగితే అది ప్రపంచ దేశాలకు డిజాస్టర్ అవుతుందని, పేదరికానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేరు.. నా అభిప్రాయం ప్రకారం పెను వినాశనానికి కారణమవుతుంది అని […]

ఇరాన్‌తో యుధ్ధం.. అత్యంత వినాశనకరం.. ఇమ్రాన్ ఖాన్
Follow us on

ఇరాన్‌తో యుధ్ధంవల్ల తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్పష్టం చేశారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు హాజరైన ఆయన ట్రంప్‌తో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్-అమెరికా మధ్య సాయుధ పోరాటమే జరిగితే అది ప్రపంచ దేశాలకు డిజాస్టర్ అవుతుందని, పేదరికానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అది ఎంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేరు.. నా అభిప్రాయం ప్రకారం పెను వినాశనానికి కారణమవుతుంది అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ట్రంప్ మీతో ఏకీభవించారా అన్న ప్రశ్నకు ఆయన.. ట్రంప్ మౌనం వహించారని, అయితే తన ఉద్దేశం ఆయనకు అర్థమైందని తెలిపారు. ఆఫ్ఘన్ సమస్య ఇంకా పరిష్కారం కావలసి ఉందని, యుధ్ధమే మొదలైతే.. ఇరాన్ అంశం మరో పెద్ద సమస్య అవుతుందని అన్నారు. సైనిక పరమైన విభేదాలను యుధ్ధం ద్వారా ఆయా దేశాలు ఎందుకు పరిష్కరించుకోవాలనుకుంటున్నాయో తనకు అర్థం కావడంలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు.

కాగా-ఇమ్రాన్‌తో భేటీ అయినఅనంతరం మాట్లాడిన ట్రంప్.. కాశ్మీర్ సమస్యపై భారత-పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన పరిణామాలను తాను నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. అవసరమైతే మీ వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి తను రెడీ అని ఇదివరకు పాడిన పాటనే ట్రంప్ మళ్ళీ ‘ పాడారు’. భారత-పాకిస్థాన్ దేశాల మధ్య విభేదాలు తమకు పెద్ద సమస్య అని పేర్కొన్న ఆయన.. ఉద్రిక్తతలను నివారించేందుకు తమ దేశం ఎప్పుడూ సిధ్ధంగా ఉంటుందని చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ట్రంప్ ఇండియాను సందర్శించే అవకాశాలున్నాయి.