కరోనాపై పోరుకు అమెరికా భారీ ప్యాకేజీ..బిల్లుకు హౌస్ ఆమోదం

| Edited By: Anil kumar poka

May 16, 2020 | 12:17 PM

కరోనా వైరస్ పై పోరుకు అమెరికా భారీ ప్యాకేజీకి ఉద్దేశించిన బిల్లును తెచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లును ప్రతినిధుల సభ 'అతి కష్టం మీద' ఆమోదించింది. లక్షలాది అమెరికన్ల కుటుంబాలకు ఆర్థికంగా సాయపడేందుకు...

కరోనాపై పోరుకు అమెరికా భారీ ప్యాకేజీ..బిల్లుకు హౌస్ ఆమోదం
Follow us on

కరోనా వైరస్ పై పోరుకు అమెరికా భారీ ప్యాకేజీకి ఉద్దేశించిన బిల్లును తెచ్చింది. 3 ట్రిలియన్ డాలర్ల ఈ బిల్లును ప్రతినిధుల సభ ‘అతి కష్టం మీద’ ఆమోదించింది. లక్షలాది అమెరికన్ల కుటుంబాలకు ఆర్థికంగా సాయపడేందుకు, కరోనా సంబంధిత టెస్టింగులకు, వివిధ రాష్ట్రాలకు, నిరుద్యోగులకు తోడ్పడేందుకు ఈ భారీ ప్యాకేజీ బిల్లును ఉద్దేశించారు. 1815 పేజీలతో కూడిన ఈ బిల్లుకు అనుకూలంగా 208 మంది సభ్యుల్లో ఓటు వేయగా.. 199 మంది వ్యతిరేకించారు. 14 మంది డెమొక్రాట్లు కూడా దీనికి తమ అంగీకారం తెలిపారు. ఇది అతి పెద్ద పెట్టుబడి అని, అమెరికన్లకు ఎంతో ప్రయోజనం కల్పించేదిగా ఉందని హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. అయితే ఇది సెనేట్ లో ఆమోదం పొందాల్సి ఉంది. ఆ సభలో రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ.. ఈబిల్లుపై ఇంకా కూలంకష  అధ్యయనం జరగాల్సి ఉందని వారు పెదవి విరిచారు.