జార్జి ఫ్లాయిడ్ హత్యపై నిరసనలు.. ‘గ్రేట్ డే’ అంటూ ట్రంప్ సెటైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2020 | 4:30 PM

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశమంతటా రేగిన ఆగ్రహ జ్వాలలను ప్రెసిడెంట్ ట్రంప్ తేలిగ్గా కొట్టిపారేశారు. 'ఇది గ్రేట్ డే' అంటూ సెటైర్లు వేశారు. దేశంలో...

జార్జి ఫ్లాయిడ్ హత్యపై నిరసనలు.. గ్రేట్ డే అంటూ ట్రంప్ సెటైర్
Follow us on

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా దేశమంతటా రేగిన ఆగ్రహ జ్వాలలను ప్రెసిడెంట్ ట్రంప్ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘ఇది గ్రేట్ డే’ అంటూ సెటైర్లు వేశారు. దేశంలో గతవారం ఏం జరిగిందో  మనమంతా చూశామని, కానీ అలాంటి అల్లర్లు, ఘర్షణలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు. బహుశా జార్జి ఇప్పుడు ‘పై నుంచి కిందికి చూస్తూ.. మన దేశంలో జరుగుతున్న ఈ వ్యవహారమంతా చెప్పుకోదగిన విషయమే’ అని వ్యాఖ్యానించి ఉంటాడని వ్యంగ్యంగా పేర్కొన్నారు. మినియాపొలీస్ లో  ఓ . పోలీసు జార్జి  మెడపై గట్టిగా తన కాలితో నొక్కడంతో అతడు మరణించాడు. ఈ ఘటన జరిగి శనివారానికి 11 రోజులైంది. దీనితో నల్లజాతీయులపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబికాయి. ఒక దశలో ఏకంగా తన వైట్ హౌస్ వద్దే  నిరసనకారులు పెద్ద సంఖ్యలో ర్యాలీకి దిగడంతో ట్రంప్ కాస్త బెదరి తన భవనం కింద ఉన్న బంకర్ లోకి వెళ్లి వచ్చాడు.  వీలైతే అక్కడ దాక్కుందామని భావించి ఉంటాడని వార్తలు వచ్చాయి.

కాగా-ట్రంప్ వ్యాఖ్యలకు  వైట్ హౌస్ మరో సానుకూల అర్థాన్ని ఆపాదించింది. జార్జి మృతిపై ఆయన గ్రేట్ డే అని వ్యాఖ్యానింఛారంటే.. దానికి తప్పుడు అర్థాలను ఆపాదించరాదని వైట్ హౌస్ సీనియర్ కమ్యూనికేషన్ అడ్వైజర్ బెన్ విలియంసన్ ట్వీట్ చేశారు. అమెరికా చట్టాల కింద సమాన  న్యాయం అంటే లా ఎన్ ఫోర్స్ మెంట్ సంస్థలను  ఏ వ్యక్తి  ప్రతిఘటించినా… అమెరికన్ అయినా.. .. అతని రంగు, జాతి వంటి వాటితో నిమిత్తం లేకుండా   సమాన  ‘ ట్రీట్ మెంట్’ లభిస్తుందన్నదే అని ఆయన వివరించారు. అటు-ట్రంప్ రాజకీయ ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి.. ట్రంప్ వాచాలత్వాన్ని తీవ్రంగా ఖండించాడు.