ఇండియన్ మేడ్ బైక్ పై హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్! ఏమిటా కథ ?

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ ! తన లేటెస్ట్ 'మిషన్ ఇంపాజిబుల్-7' సిరీస్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ చిత్రం సెట్స్ లో ఈ హీరో.. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇండియాలో తయారైన బీ ఎం డబ్ల్యు మోటార్ సైకిల్ ని..

ఇండియన్ మేడ్ బైక్ పై హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్! ఏమిటా కథ ?

Edited By:

Updated on: Oct 13, 2020 | 12:11 PM

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ ! తన లేటెస్ట్ ‘మిషన్ ఇంపాజిబుల్-7’ సిరీస్ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ చిత్రం సెట్స్ లో ఈ హీరో.. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇండియాలో తయారైన బీ ఎం డబ్ల్యు మోటార్ సైకిల్ ని వినియోగించడం విశేషం. ఇలాంటి సన్నివేశాల్లో డూప్ లేకుండా స్వయంగా పర్ఫామ్ చేయడాన్ని ఇష్టపడతాడు. గతంలో నార్వే లోనూ  జరిగిన షూటింగుల్లో అత్యంత సాహసోపేతమైన బైక్ స్టంట్స్ చేసి వాహ్ అనిపించాడు.  టామ్ క్రూజ్ కి ఇండియాలో కూడా మంచి పాపులారిటీ ఉంది.