Tesla driverless car crashes: డ్రైవర్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వచ్చిన డ్రైవర్‌లెస్ కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఈ దుర్ఘటన అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది.
టెక్సాస్‌కు చెందిన ఇద్దరు టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. కారును సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌లో పెట్టి వాళ్లు ప్రయాణిస్తుండగా.. రోడ్డుపై మలుపు వచ్చింది. ఆ సమయంలో అక్కడ మలుపు తిరగడంలో కారు కంప్యూటర్ వ్యవస్థ విఫలమైంది. దీంతో రోడ్డుపక్కనే ఉన్న చెట్టును ఆ కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులోని ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక వ్యక్తి డ్రైవర్ సీటు పక్కనే ఉండే ఫ్రంట్ సీటులో ఉండగా, మరో వ్యక్తి వెనుక సీటులో ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సదరు కారు వేగంగా ప్రయాణిస్తూ మలుపు తిరగడంలో విఫలమైందని, ఆపై చెట్టుకు ఢీకొని తగలబడిపోయి ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Two men were killed after a Tesla car crashed into a tree and caught fire in Texas, and police believe there was nobody present in the driver’s seat at the time of the accident, writes BBC. https://t.co/4OGZc5K4IS
— clevelanddotcom (@clevelanddotcom) April 19, 2021
Read Also…
అయోధ్యపై కరోనా ఎఫెక్ట్.. రామాలయాన్ని మూసివేసిన అధికారులు.. శ్రీరామనవమి వేడుకలకు దూరం..