అమెరికాలోని డెట్రాయిట్‌లో తానా మహా సభలకు ఫండ్ రైజింగ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అధ్యక్షుడు సతీష్ వేమనతో పాటు తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నరేన్ కొడాలి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. జులై 4,5,6 తేదీలలో వాషింగ్టన్‌లో తానా కన్వెన్షన్ జరగనుంది. ఈ సందర్భంగా 4 లక్షల యాబై వేల డాలర్ల విరాళాల రూపంలో వచ్చినట్లు తానా సభ్యులు తెలిపారు.