కరోనాను ‘దాచిపెట్టినందుకు’ చైనాపై అదనపు సుంకాలు… ట్రంప్

| Edited By: Anil kumar poka

May 02, 2020 | 12:30 PM

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినందుకు ఆ దేశంపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశానికి శిక్షగా ఇదే తగిన పరిష్కారమన్నారు. అయితే.....

కరోనాను దాచిపెట్టినందుకు చైనాపై అదనపు సుంకాలు... ట్రంప్
Follow us on

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టినందుకు ఆ దేశంపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ దేశానికి శిక్షగా ఇదే తగిన పరిష్కారమన్నారు. అయితే పెంచిన సుంకాలను ఎప్పటినుంచి  విధిస్తామన్నవిషయాన్ని ఆయన వివరించలేదు. ఏం జరుగుతుందో చూద్దాం.. చైనాకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు చాలా అసంతృప్తిని కలిగిస్తున్నాయి. అని ఆయన వ్యాఖ్యానించారు. 182 దేశాలు ఈ కల్లోలాన్ని ఎదుర్కొంటున్నాయని, అన్ని దేశాలూ నరకాన్ని చవి చూస్తున్నాయని ఆయన ఇటీవల పేర్కొన్న సంగతి విదితమే.. అటు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా.. చైనా తీరును మళ్ళీ తప్పు పట్టారు. కరోనా విషయంలో ఆ దేశం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, ఏమీ ఎరగని నంగనాచిలా నటిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఆ దేశంలో ఎవరైనా దీనిపై మాట్లాడబోతే వారిని అందుకు అనుమతించడం లేదన్నారు. చైనాలో చాలా ల్యాబ్స్ ఉన్నాయని, వాటిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడంలేదన్నారు. ఆ ల్యాబ్స్ నుంచి అప్పుడప్పుడు కొంత సమాచారం లీక్ అవుతూ ఉంటుందని, దాన్నే విశ్వసించాల్సి వస్తోందని మైక్ పాంపియో పేర్కొన్నారు.