America Polio Case: అమెరికాలో నయా టెన్షన్.. పదేళ్ల తర్వాత వెలుగు చూసిన పోలియో కేసు..

|

Jul 22, 2022 | 12:01 PM

Polio Case: అమెరికాలో 10 సంత్సరాల తర్వాత తొలి పోలియో కేసు బయటపడింది. పూర్తి పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు పోలియోగా నిర్ధారించారు.

America Polio Case: అమెరికాలో నయా టెన్షన్.. పదేళ్ల తర్వాత వెలుగు చూసిన పోలియో కేసు..
Polio Case In Us
Follow us on

పదేళ్ల క్రితమే పోలియో రహితంగా దేశంగా అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత  న్యూయార్క్‌లోని రాక్‌లాండ్ కౌంటీలో నివసిస్తున్న ఓ యువకుడిలో పోలియో వైరస్ గుర్తించారు. జూలై 21, గురువారం చేసిన పరీక్షల తర్వాత స్థానిక ఆరోగ్య అధికారులు ఈ సమాచారాన్ని వెల్లడించారు. అమెరికా పోలియో రహితంగా ప్రకటించబడిన పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చిన మొదటి కేసు ఇదే. ‘ది వాషింగ్టన్ పోస్ట్’ నివేదిక ప్రకారం, ఈ 20 ఏళ్ల యువకుడు జూన్‌లో ఆసుపత్రిలో చేరాడు. దాదాపు నెల రోజుల పాటు అతడిని పరిశీలించారు. పోలియో ఒక వైరల్ వ్యాధి అని, ఇది ఒక వ్యక్తి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అన్నారు. దీని కారణంగా కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుందని ఆరోగ్య అధికారి తెలిపారు. 

విచారణకు ఆదేశించిన అమెరికా

ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. న్యూయార్క్‌లోని రాక్‌లాండ్ కౌంటీలో పోలియో కేసు నిర్ధారించబడింది. అయితే.. 95 శాతం మందికి పోలియో లక్షణాలు లేవని, అయినప్పటికీ వారు ఈ వైరస్‌ను వ్యాప్తి చేయగలరని కూడా పేర్కొంది. కౌంటీ హెల్త్ కమిషనర్ డాక్టర్ ప్యాట్రిసియా ష్నాబెల్ రూపెర్ట్ మాట్లాడుతూ, “మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. పరిస్థితిని ఎదుర్కోవటానికి న్యూయార్క్ రాష్ట్ర ఆరోగ్య శాఖ, నివారణ కేంద్రాలతో కలిసి పని చేస్తున్నాము.” అని అన్నారు.