కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, ఎవరిదీ పని ? ఖలిస్తానీలదేనా ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 30, 2021 | 2:20 PM

అమెరికా..కాలిఫోర్నియాలోని ఓ పార్కులో గల  మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు..

కాలిఫోర్నియాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం, ఎవరిదీ పని ? ఖలిస్తానీలదేనా ?
Follow us on

అమెరికా..కాలిఫోర్నియాలోని ఓ పార్కులో గల  మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు. 294 కేజీల బరువు, ఆరు అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడమే గాక. బేస్ మెంట్ నుంచి తొలగించివేశారు. విగ్రహం తలలో సగభాగాన్ని చెక్కివేసి ఎక్కడో పడవేశారు. ఈ నెల 27 ఉదయమే పార్కుకు చెందిన ఓ ఉద్యోగి ఈ దృశ్యం చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తొలగిస్తున్నామని, దీన్ని మళ్ళీ బాగు చేస్తామని డేవిస్ సిటీ కౌన్సిలర్ ల్యుకాస్ ఫ్రెరిచ్ తెలిపారు. విగ్రహ ధ్వంసం పట్ల అమెరికాలోని ఇండో-అమెరికన్లంతా తీవ్రంగా ఖండించారు.  ఈ ద్రోహానికి పాల్పడినవారిని పోలీసులు వెంటనే పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

డేవిస్ నగరానికి ఈ స్టాట్చ్యు ని భారత ప్రభుత్వం డొనేట్ చేసింది. నాలుగేళ్ల క్రితం దీన్ని ఈ పార్కులో ఏర్పాటు చేశారు. అయితే భారత్ తో బాటు గాంధీజీని వ్యతిరేకిస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా సంస్థ దీన్ని అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఇందుకు ప్రచారం కూడా ప్రారంభించింది. అటు-ఈ చర్యను ఖలిస్తాన్ అనుకూల బృందం ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఫోటోలను ప్రచురిస్తూ..దీన్ని ‘గుడ్ డే’ గా అభివర్ణించింది. గత డిసెంబరులో వాషింగ్టన్ లో బాపూజీ విగ్రహానికి ఖలిస్తానీ అనుకూలురు నల్లరంగు పూసి తమ నిరసన ప్రకటించారు.