న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో గురుపూర్ణిమ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, వైభవంగా సాగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు మూడు వేల మంది భక్తులు వచ్చారు. బాబాకు అభిషేకాలు, అఖండ కీర్తన, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తోడు పల్లకి సేవను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు తెలుగు విద్యార్థులను స్కాలర్‌షిప్స్ అందజేసింది సాయిదత్త పీఠం.