Moon Rock in White House: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ పదవి చేపట్టారు. ఓ వైపు పాలనలో తనదైన మార్క్ వేయడానికి ప్రయత్నిస్తూనే .. మరోవైపు తన అధికార నివాసంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని తన అధికారిక నివాసంలో అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. తనకు నచ్చిన విధంగా ఇల్లును అలంకరించే పనిలో ఉన్నారట జో బైడెన్..
ఈక్రమంలోనే ఓ అరుదైన వస్తువును ఆయన ఏరి, కోరి తెప్పించుకున్నారని తెలుస్తోంది. అదే.. చంద్రశిల 1972లో అపోలో-17 మిషన్ ద్వారా చంద్రుడిపై నుంచి ‘నాసా’ వ్యోమగాములు సేకరించిన రాళ్ల నమూనాల్లో అది ఒకటి. ‘లూనార్ శాంపిల్ 76015, 143’ అని పిలిచే ఆ మూన్ రాక్‌ను బైడెన్ సూచనమేరకు ఆయన సహాయక యంత్రాంగం నాసా లేబొరేటరీ నుంచి తెప్పించారట.. ఆ మూన్‌రాక్ ను బైడెన్ కూర్చునే ప్రధాన డెస్క్‌కు పక్కనే గోడకు బెంజమిన్ ఫ్రాంక్లిన్ చిత్రపటం తగిలించి ఉంటుంది. దాని పక్కనే ఉండే బుక్ షెల్ఫ్ అడుగుభాగంలో మూన్ రాక్‌ను అమర్చారట. గత అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల్లో మార్పులే కాదు.. వైట్ హౌస్ రూపు రేఖల్లో కూడా మార్పులు చేపడుతున్నారు జో. ఈ మార్పుల్లో భాగంగానే చంద్ర శిల పెద్దన్న చెంతకు చేరింది. దీంతో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కొన్ని నమ్మకాలు విడిచి పెట్టరని తెలుస్తోంది.
Also Read: డిఫరెంట్ లవ్ స్టోరీతో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో జతకట్ట నున్న బాలీవుడ్ బాద్షా