భారత్‌లో… టీకా కేంద్రాల వద్ద “నో స్టాక్ బోర్డులు” చూసి నిరాశతో తిరిగి వెళుతున్న బోర్డులు … అమెరికాలో… రండి..! రండి..! టీకా వేయించుకుంటే మీకు బీరు ఇస్తాం.., లాటరీ టిక్కెట్లు ఇస్తాం.. అని ఆఫర్లు ఇస్తున్న బోర్డులు కనిపిస్తున్నాయి. అవును, అమెరికాలో టీకా వేయించుకునేలా ప్రజలను ఒప్పించడానికి అధికార యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. గత నెల రోజులుగా అమెరికాలో టీకాలు వేయించుకునే ప్రజల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వాలే ఆఫర్లు ఇవ్వడం మొట్టాయి.
అమెరికాలో ఇప్పటికే 58 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయింది. జూలై 4 నాటికి 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని బైడెన్ సర్కారు ప్రణాళికలు. జూలై కి 18 కోట్ల మందికి కనీసం ఒక డోసు, 16 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చేవిధంగా ప్రణాళికలకు అమెరికా అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చాడు. వ్యాక్సిన్ వచ్చిన కొత్తలో ప్రజలు అత్యధికంగా ఉత్సాహం చూపించినప్పటికీ ప్రస్తుతం ఆ జోరు కొద్దిగ తగ్గింది. దేశంలో మిగులు వ్యాక్సన్లు ఉన్నప్పటికీ గత నెలరోజులుగా మందకొడిగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ముఖ్యంగా యువత వ్యాక్సిన్ తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో వారి ఆకట్టుకునేందుకు సరికొత్త మార్గాలను వెతుకుతోంది అమెరికా ప్రభుత్వం.
టీకా వేసుకున్న 18 ఏళ్లు పైబడిన వారు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుంటే లాటరీ తీసి విజేతలను ఎంపిక చేస్తారు.
ఎంపికయినవారు రాష్ట్ర గవర్నర్ దంపతులతో కలసి వారింట్లోనే భోజనం చేసే బంపర్ ఆఫర్ అంటూ ప్రకటనలు జారీ చేస్తోంది అక్కడి ప్రభుత్వ యంత్రాంగం.
టీకా వేయించుకున్నవారిలో అదృష్టవంతులకు ప్రతి వారం 1 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీల్లో రూ. 7.3 కోట్లు బహుమానం అంటూ ప్రకటించారు ఒహైయో గవర్నర్. 18 ఏళ్లు నిండి కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని గవర్నర్ మైక్ డివైన్ స్వయంగా ప్రకటించారు. అయితే లాటరీ పద్దతని తీసుకొచ్చారు. లాటరీ విజేతకు డబ్బులు ఇవ్వరు. ఏడాదిపాటు స్కూల్ స్కాలర్షిప్ ఇస్తారు. అమెరికాలోని ఈ రాష్ట్రంలో విద్య అత్యంత ఖరీదు కాబట్టి టీకా కోసం ప్రజలు ముందుకు వస్తారని ఇలా ప్లాన్ చేశారు.
టీకాలు తీసుకునే 16 నుండి 35 సంవత్సరాల వయస్సు గల స్థానికులకు రాష్ట్రం ప్రభుత్వం 100 డాలర్ల పొదుపు బాండ్లను అందిస్తుందని గవర్నర్ జిమ్ జస్టిస్ ప్రకటించారు. ఇక అక్కడి ప్రభుత్వ పెద్దలు మాత్రమే కాదు ఆ రాష్ట్రంలోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం ప్రోత్సాహాలను ఇస్తున్నాయి. ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక అధికారులు , ఫార్మసీలు, రెస్టారెంట్లు, బ్రూవరీస్, సూపర్ మార్కెట్లు మరియు క్రీడా బృందాలతో భాగస్వామ్యం పెట్టుకొని
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రోత్సాహకాలను అందిస్తూ, ప్రజలకు బంపర్ ఆఫర్ లు ఇస్తూ ముందుకు వెళుతున్నారు.
మేరీలాండ్ గవర్నర్ కూడా దాదాపు ఇటువంటి ఆఫర్‌నే యువతకు ఆఫర్ చేశారు. ఇదిలా ఉంటే.. క్రిస్పీ క్రీమీ అనే రెస్టారెంట్ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా యువతను పోత్రహిస్తోంది. వ్యాక్సినేషన్ కార్డుతో తమ స్టోర్‌కు వచ్చిన యువతకు ఫ్రీగా డోనట్‌ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
గవర్నర్ ఫిల్ మర్ఫీ టీకాలను ప్రోత్సహించడానికి “షాట్ అండ్ ఎ బీర్” కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతేకాకుండా మే నెలలో టీకా మొదటి డోసు తీసుకున్న యువత తమ వ్యాక్సినేషన్ కార్డు ద్వారా ఫ్రీగా బీర్‌ను పొందొచ్చు అని చెప్పిన గవర్నర్
ఉబర్, లిఫ్ట్ రవాణా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది బైడెన్ ప్రభుత్వం. టీకా వేయించుకోవడానికి వచ్చేవారిని ఈ సంస్థలు తమ వాహనాల్లో ఉచితంగా తీసుకెళ్లి తీసుకొస్తారు.
ఇదిలావుంటే ఫిలడెల్ఫియాలో అక్కడి వాణిజ్య సంస్థలు కూడా భారీ ప్రకటనలు చేస్తున్నాయి. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు టీకా తీసుకుంటే… 100 నుంచి 200 డాలర్ల ప్రోత్సాహకాలు అందుస్తున్నాయి.
టీకా వేయించుకున్నవారికి ఈ వేసవిలో సాగే సంగీత విభావరులకు ఉచిత పాసుల ఇస్తున్నాయి.
టీకాలు వేయించుకున్నవారికి తమ దగ్గర ఆహారం కొంటే డ్రింక్స్ ఉచితం ఆఫర్ చేస్తున్నాయి రెస్టారెంట్లు.
18 ఏళ్లు పైబడి టీకా వేయించుకున్నవారికి 20 డాలర్ల విలువైన లాటరీ టికెట్ ఉచితంగా ఇస్తున్నాయి. లాటరీ తగిలితే 50 లక్షల డాలర్ల బహుమతి వచ్చే ఛాన్స్ ఉంది.
అమెరికా మొత్తం జనాభా – 32.8 కోట్లు
మొత్తం జనాభాలో కనీసం ఒక్క డోసు టీకా పొందినవారు – 16,24,70,794
రెండు డోసుల పూర్తి టీకా పొందినవారు – 12,90,06,463
దేశ జానాభాలో ఒక్క డోసు టీకా పొందినవారు 48.9 శాతం కాగా, రెండు డోసులు పొందినవారు 38.9 శాతం
65 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు వ్యాక్సిన్ పొందినవారు – 4,66,20,321
65 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసులు వ్యాక్సిన్ పొందినవారు – 4,03,22,410
అంటే… జనాభాలో 85.2 శాతం మంది వృధ్దులకు కనీసం ఒక్క డోసు టీకా,
73.7 శాతం మంది వృద్దులకు రెండు డోసుల టీకా అందింది
18 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు వ్యాక్సిన్ పొందినవారు – 15,77,20,909
18 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారు – 12,71,11,729
అంటే… జనాభాలో 18 ఏళ్లు పైబడినవారిలో ఒక్క డోసు టీకా పొందినవారు 61.1 శాతం మంది
జనాభాలో 18 ఏళ్లు పైబడినవారిలో రెండు డోసులు టీకా పొందినవారు 49.2 శాతం మంది
అమెరికాలో 12 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుండటం విశేషం
తాజా లెక్కల ప్రకారం అమెరికాలో 6.2 కోట్ల డోసుల టీకాల నిల్వ ఉంది. టీకాలు ఎక్కువ, టీకా వేయించుకునేవారు తక్కువ… ఇదీ ప్రస్తుత అమెరికా పరిస్థితి అందుకే ఈ ఆఫర్లు ఇస్తున్నాయి అక్కడి విశ్లేషకులు.