అమెరికాలో భారీ వరదలు..

|

May 21, 2020 | 2:56 PM

కరోనా వైరస్‌తో వణికిపోతున్న అమెరికాను భారీ వర్షాలు మరింత భయపెట్టిస్తున్నాయి. మిచిగాన్‌ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్‌ఫోర్డ్ ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. మిచిగాన్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఈడెన్‌ విల్లే, శాన్‌ఫోర్డ్, మిడ్‌ ల్యాండ్‌ నగరాలను ఖాళీ చేయించారు. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు. అమెరికా జాతీయ […]

అమెరికాలో భారీ వరదలు..
Follow us on

కరోనా వైరస్‌తో వణికిపోతున్న అమెరికాను భారీ వర్షాలు మరింత భయపెట్టిస్తున్నాయి. మిచిగాన్‌ రాష్ట్రంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్‌ఫోర్డ్ ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.

మిచిగాన్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఈడెన్‌ విల్లే, శాన్‌ఫోర్డ్, మిడ్‌ ల్యాండ్‌ నగరాలను ఖాళీ చేయించారు. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు. అమెరికా జాతీయ వాతావరణశాఖ కూడా దీన్ని ‘ప్రాణాంతక పరిస్థితి’గా పేర్కొంది.

ఇప్పటికే మిడ్ ల్యాండ్ ప్రాంతంలో దాదాపు 9 అడుగుల ఎత్తునకు వరదనీరు చేరగా, వేలాది వాహనాలు నీట మునిగాయి. మరోవైపు 500 ఏళ్ల తర్వాత 1986లో ఏర్పడిన వరద పరిస్థితి రానుందన్నారు. టిట్టాబావాస్సీ నది నీటి మట్టం 38 అడుగుల రికార్డు ఎత్తుకు పెరిగే అవకాశముందున్నారు.