అమెరికాలో ఫైర్ బాల్స్ పెద్ద సంచలనంగా మారుతున్నాయి. రాత్రి సమయంలో ఆకాశం నుంచి వేగంగా నేలపైకి దూసుకొస్తున్న నిప్పు రవ్వలను టెక్సాస్ నగరవాసులు వేలాది మంది చూశారు. వాటిని చూసిన అక్కడి జనం ఆశ్చర్యానకి గురయ్యారు. ఇది మేఘాలలో అధిక వేగంతో కదులుతున్నట్లు కనిపించింది. నిప్పు రవ్వలు వేగంగా నేలపైకి దూసుకొస్తున్న దృశ్యాలను టెక్సాస్ వాసులు రికార్డ్ చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రత్యేక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు ఇక్కడ కనిపించాయని చెప్పారు.
అయితే ఆ సమయంలో మొత్తం 213 ఫైర్ బాల్స్ నేలపైకి దూసుకొచ్చాయని అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ (AMS) తెలిపింది. వాటిలో మూడు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలు టెక్సాస్, ఓక్లహోమా, మిస్సౌరీ, అర్కాన్సాస్‌తోపాటు లూసియానాలో కనిపించినట్లుగా చెబుతున్నారు.
ఫైర్ బాల్స్‌ను పోలి ఉండే వస్తువులు కొన్ని క్షణాల పాటు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. ప్రజలు దీనిని 3 నుండి 4 సెకన్ల వరకు చూశారని చెప్పారు (ఉత్తర టెక్సాస్ స్కైర్‌లో ఫైర్‌బాల్). ఆకాశం నుంచి వేగంగా వస్తున్నందున అవి ఒకరకమైన ధ్వనిని విడుదల చేసినట్లుగా వారు వెల్లడిచారు. AMS ఫైర్‌బాల్ ఒక ఉల్క అని చెప్పారు.
Fireball this evening over Austin, Texas as seen from this @Tesla dashcam driving on Mopac @EvilMopacATX #KXAN pic.twitter.com/14dvGv1gKD
— Nick Bannin (@nickbannin) July 26, 2021
సాయంత్రం వీనస్ గ్రహం ప్రకాశించినంత ప్రకాశవంతంగా ఆ ఫైర్ బాల్స్ కనిపించాయని వారు అంటున్నారు. వీరు చెప్పిన ఫైర్ బాల్స్ సమాచారం సరైనదే అని USA అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) వెల్లడించింది. వాతావరణలో వచ్చే మార్పులు.. రాపిడి కారణంగా ఇలాంటి ఫైర్ బాల్స్ ఉత్పన్నం అవుతాయని పేర్కొంది.
ప్రతి సంవత్సరం వేలాది ఉల్కలు భూమి వైపుకు వస్తుంటాయి. ఇవి భూ ఉపరితలంలోకి ప్రవేశించిన వెంటనే ఫైర్‌బాల్‌గా మారి.. తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో లేదా సముద్ర ప్రాంతాలలో శిధిలాల రూపంలో పడతాయి. అయితే గత ఆదివారంలో నార్వేలో కూడా ఒక ఉల్క పడిపోయింది. దీని కారణంగా భారీ పేలుడు సంభవించింది. ప్రజలు చాలా భయపడ్డారు. ఉల్క పడిపోయిన వెంటనే ప్రకాశవంతమైన కాంతి కూడా కనిపించింది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగదని పరిశోదకులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..