అమెరికన్ ‘సక్సెస్ స్టోరీ’లపై జుకర్ బెర్గ్..జెఫ్ బెజోస్ వాంగ్మూలం !

అమెరికాలో ఫేస్ బుక్, ట్విటర్ వంటివాటిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కస్సుమంటుండడంతో వీటి అధినేతలు అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం  తమ వాంగ్మూలాలను ఇవ్వనున్నారు. కరోనా వైరస్ తరుణంలో..

  • Umakanth Rao
  • Publish Date - 10:46 am, Wed, 29 July 20
అమెరికన్ 'సక్సెస్ స్టోరీ'లపై జుకర్ బెర్గ్..జెఫ్ బెజోస్ వాంగ్మూలం !

అమెరికాలో ఫేస్ బుక్, ట్విటర్ వంటివాటిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కస్సుమంటుండడంతో వీటి అధినేతలు అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం  తమ వాంగ్మూలాలను ఇవ్వనున్నారు. కరోనా వైరస్ తరుణంలో వీటిపై వస్తున్న విమర్శలకు వారు సమాధానమివ్వబోతున్నారు. ఫేస్ బుక్, గూగుల్, యాపిల్, అమెజాన్ చీఫ్ లు అమెరికన్ కాంగ్రెస్ లో ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ సామాజిక మాధ్యమాల అధినేతలు ఏం చెబుతారో నన్న ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక సుమారు వంద రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నేపథ్యంలో వీరు తమ సంస్థల ద్వారా ఎలా వ్యవహరించబోతారన్నది చర్చనీయాంశంగా మారింది.

అమెరికా చట్టాలు పటిష్టంగా లేనిదే తాము సక్సెస్ కాజాలమని జుకర్ బెర్గ్ పేర్కొనవచ్చు.. తమ ఫేస్ బుక్ దేశానికే గర్వకారణం అని ఆయన సమర్థించుకోవచ్చు. యాపిల్ చీఫ్ టిమ్ కుక్, గూగుల్ అధినేత సుందర్ పిచాయ్ కూడా తమ ‘వాదనలను’ ఈ విచారణ సందర్భంగా వినిపించనున్నారు. అమెరికన్ చట్టాలలోని గొప్పతనాన్ని తాము కూడా వివరిస్తామని. అయితే వీటిని స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని జెఫ్ బెజోస్ అభిప్రాయపడుతున్నారు.