అమెరికా రహస్యాలను చైనాకు అమ్మిన మాజీ సీఐఎ ఏజంట్ అరెస్ట్

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఓ సామెత.. కానీ ఈ కాలంలో ఇలాంటి సామెతలేవీ నడిచేట్టు కనబడడంలేదు. అమెరికాలో ఒకప్పుడు సీఐఏ , ఎఫ్ బీ ఐ కి పని చేసిన 67 ఏళ్ళ మాజీ ఏజంట్ ఒకరు పట్టుబడ్డారు.

అమెరికా రహస్యాలను చైనాకు అమ్మిన మాజీ సీఐఎ  ఏజంట్ అరెస్ట్

Edited By:

Updated on: Aug 18, 2020 | 1:41 PM

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఓ సామెత.. కానీ ఈ కాలంలో ఇలాంటి సామెతలేవీ నడిచేట్టు కనబడడంలేదు. అమెరికాలో ఒకప్పుడు సీఐఏ , ఎఫ్ బీ ఐ కి పని చేసిన 67 ఏళ్ళ మాజీ ఏజంట్ ఒకరు పట్టుబడ్డారు. ఈయన అమెరికా రహస్యాలను చైనాకు అమ్ముతూ సొమ్ము బాగానే వెనకేసుకున్నాడు. ఏండ్రు యుక్ చింగ్ మా అనే ఈ పెద్ద మనిషి 1967-1983 మధ్య కాలంలో సీఐఎ , ఎఫ్ బీ ఐ కి పని చేశాడు. చైనాలో అమెరికాకు తొత్తులుగా ఎవరెవరు వ్యవహరిస్తున్నారో. అలాగే అమెరికాలో చైనాకు వ్యతిరేకంగా ఎవరు పని చేస్తున్నారో వగైరా విశేషాలే కాక, సీఐఎ  కమ్యూనికేషన్లు, ఎఫ్ బీ ఐ రహస్యాలు తదితరాలను చైనాకు అమ్ముతూ..తడవకి  50 వేల డాలర్లను వసూలు చేస్తూ వచ్ఛేవాడని అమెరికన్ పోలీసులు తెలిపారు. ఇతడిని హవాయి లోని ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు.

ఇతగాడి వయస్సును పరిగణనలోకి తీసుకున్న కోర్టు…. ఇతడి శిక్షను ధృవీకరించాల్సి ఉంది. చైనాకు అనుకూలంగా పని చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని నిర్భయంగా చెప్పాడట ఈ వ్యక్తి.. ఇతడ్ని పట్టుకోవడం కూడా సినిమాటిక్ గా సాగింది. చైనీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నకిలీ అవతారమెత్తిన అమెరికన్ ఏజంట్ ఒకరు చాకచక్యంగా ఇతడి వివరాలు తెలుసుకుని,  మచ్చిక చేసుకుని మొత్తానికి గుట్టును రట్టు  చేశాడు.