ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ రాజీనామా!

|

Jul 30, 2019 | 4:15 AM

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బృందం నుంచి మరో కీలక ఉన్నతాధికారి వైదొలగారు. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ బాధ్యతల నుంచి డాన్ కోట్స్ తప్పుకున్నారు. కోట్స్ ఆగస్టు 15న వైదొలగుతారని, ఆయన స్థానంలో టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌ను తాను నామినేట్ చేస్తున్నానని ట్రంప్ ట్విటర్‌లో తెలిపారు.రష్యా, ఉత్తర కొరియా అంశాల్లో కోట్స్, ట్రంప్ మధ్య తరచూ విభేదాలు పొడసూపాయి.జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌గా కోట్స్ ప్రస్తుతం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), […]

ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో ఇంటలిజెన్స్ డైరెక్టర్ రాజీనామా!
Follow us on

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ బృందం నుంచి మరో కీలక ఉన్నతాధికారి వైదొలగారు. జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ బాధ్యతల నుంచి డాన్ కోట్స్ తప్పుకున్నారు. కోట్స్ ఆగస్టు 15న వైదొలగుతారని, ఆయన స్థానంలో టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్ సభ్యుడు జాన్ రాట్‌క్లిఫ్‌ను తాను నామినేట్ చేస్తున్నానని ట్రంప్ ట్విటర్‌లో తెలిపారు.రష్యా, ఉత్తర కొరియా అంశాల్లో కోట్స్, ట్రంప్ మధ్య తరచూ విభేదాలు పొడసూపాయి.జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌గా కోట్స్ ప్రస్తుతం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) సహా 17 అమెరికా నిఘా సంస్థల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు.