అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనను మరిచిపోలేకపోతున్నారు. ఈ మధ్యే తన భర్త, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించిన అనుభూతిని తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఆమె.. తన భారత పర్యటనపై మళ్ళీ ట్వీట్లు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఇతరులు ఇండియాలో తమకు ఇఛ్చిన ఘనస్వాగతానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్ ఇఛ్చిన వెల్ కమ్ మరువలేనిదని అన్నారు. భారత, అమెరికా దేశాల జాతీయ పతాకాలు రెండూ స్నేహ, సౌభ్రాత్రాలకు గుర్తుగా ఎగిరిన ఆ రోజును ‘బ్యూటిఫుల్ డే’ గా అభివర్ణించారు.
అలాగే ట్రంప్ ను, ప్రధాని మోదీని ఆమె తన మరో ట్వీట్ లో ట్యాగ్ చేస్తూ.. ‘మోదీజీ ! మీ అందమైన దేశానికి మీరు, మీ దేశ ప్రజలు మాకు స్వాగతం పలికిన తీరుపై ఎంతో ఆనందిస్తున్నానని’ పేర్కొన్నారు. ఢిల్లీలో మహాత్మాగాంధీ సమాధి వద్ద శ్రధ్ధాంజలి ఘటించి అక్కడ ఓ మొక్కను నాటిన విషయాన్ని కూడా మెలనియా గుర్తు చేసుకున్నారు. ఇది మాకెంతో గౌరవప్రదమైన ఘటన అన్నారు. ఢిల్లీలోని ఓ స్కూల్లో తనను విద్యార్థులకు పరిచయం చేసిన టీచర్ మను గులాటీకి కూడా ఆమె మరువలేదు. గులాటీకి సైతం కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్ పై గులాటీ కూడా స్పందించి మెలనియాకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేయడం విశేషం. మా పిల్లలు కూడా మీ విజిట్ ని ఎంతో ఎంజాయ్ చేసారని ఆమె తెలిపారు.
Thank you @narendramodi for welcoming me and @POTUS to your beautiful country. We were delighted to receive such a warm welcome from you and the people of India! pic.twitter.com/lWyndlcpI7
— Melania Trump (@FLOTUS) February 28, 2020