మోతేరా స్టేడియం.. వాహ్ ! ఫస్ట్ టైం బీసీసీఐ ‘బొనాంజా’

| Edited By: Anil kumar poka

Feb 19, 2020 | 6:04 PM

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అతి పెద్ద మోతేరా స్టేడియం ఏరియల్ వ్యూ.. వాహ్ ! ఫోటో ట్వీట్ చేసిన బీసీసీఐ.. క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీ.. ఖుషీ..

మోతేరా స్టేడియం.. వాహ్ ! ఫస్ట్ టైం బీసీసీఐ బొనాంజా
Follow us on

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అతి పెద్ద మోతేరా  క్రికెట్ స్టేడియం ఏరియల్ వ్యూని బీసీసీఐ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ స్టేడియంలో లక్షా 10 వేల మందికి సీటింగ్ కెపాసిటీ ఉందని పేర్కొంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో ప్రధాని మోడీతో కలిసి ఈ స్టేడియాన్ని విజిట్ చేస్తున్న సందర్భంగా.. దీన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతునారు. బీసీసీఐ ఈ ఫోటోను ట్వీట్ చేయడంతో క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దే లేదు. ట్రంప్ రాక నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆస్ట్రేలియా.. మెల్ బోర్న్ లోని క్రికెట్ స్టేడియం కన్నా ఇది అతి పెద్దదని బీసీసీఐ పేర్కొంది. ఆ స్టేడియం సీటింగ్ కెపాసిటీ కేవలం 90 వేలు మాత్రమే.. కాగా- గతః ఏడాది జనవరిలో గుజరాత్  క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నాధ్వానీ.. అప్పుడు నిర్మాణం లో ఉన్న మొతేరా స్టేడియం ఫోటోలను రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ స్టేడియాన్ని ఎప్పుడు చూస్తానా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తహలాడుతున్నారు. కాగా-ఆయన రాకను పురస్కరించుకుని ఈ స్టేడియానికి ఆనుకుని ఉన్న పేదల ఇళ్లను ఖాళీ చేయాలని  అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధికారులు వారికి నోటీసులు జారీ చేయడంతో వారు వీధిన పడుతున్నారు.