Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది: అమెరికా

|

May 24, 2021 | 7:24 PM

Corona Vaccine: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా..

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది: అమెరికా
Follow us on

Corona Vaccine: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని అమెరికాలో జరిగిన తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని గ్రూప్‌ డైరెక్టర్, వైరాలజిస్ట్‌ గ్రెగొరీ పోలండ్‌ ఈ విషయాలను వెల్లడించారు. వ్యాక్సిన్‌ మొదటి డోస్‌కు, రెండో డోసుకు మధ్య గ్యాప్‌ను పెంచడం ద్వారా యాంటీబాడీలు 20 నుంచి 300 శాతం ఎక్కువగా పెరుగుతాయని తేలిందని గ్రెగొరీ వెల్లడించారు. దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్లలో ఈ తరహా ఫలితాలే వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

అయితే మొదటి డోసు వ్యాక్సిన్‌ వేసిన వారికి స్వల్ప కాలంలోనే రెండో డోసు కూడా వేస్తుండటంతో అందరికీ వ్యాక్సిన్‌ అందడం ఆలస్యం అవుతోంది. అలా కాకుండా మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి రెండో డోసును ఆలస్యం చేసి ఇతరులకు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత పెరిగితే అంత మంచిదని తాజాగా జరిగిన పరిశోధనలో వెల్లడైనట్లు గ్రెగొరీ పేర్కొన్నారు.

కరోనా కట్టడికి ప్రస్తుతం కొన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. ముందుగా పెద్దవారికి ఈ కరోనా టీకాలు వేయగా, తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

విషాదం.. మారథాన్‌ నిర్వహిస్తుండగా వడగండ్ల వర్షం.. 21 మంది మృతి.. పలువురికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

Rajasthan Covid-19: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 345 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ