US Tornado: అమెరికాను చుట్టేస్తున్న సుడిగాలి.. 24 మందిని బలితీసుకున్న అత్యంత భయంకరమైన టర్నోడో..

|

Apr 02, 2023 | 7:05 PM

అమెరికాలో మరోసారి టోర్నడో బీభత్సం సృష్టించింది. 15 రోజుల వ్యవధిలో రెండోసారి భారీ టోర్నడో విరుచుకుపడటంతో వందలాది మంది గాయపడ్డారు. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది నిరాశ్రయులయ్యారు.

US Tornado: అమెరికాను చుట్టేస్తున్న సుడిగాలి.. 24 మందిని బలితీసుకున్న అత్యంత భయంకరమైన టర్నోడో..
Tornado
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో తుఫాన్లు, టోర్నడోలు మరోసారి విధ్వంసం సృష్టించాయి. టోర్నడోల ధాటికి 24 మంది చనిపోయారు..చాలా మంది గాయపడ్డారు. గత వారం మిసిసిపి పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడో తాజాగా దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్‌, ఇల్లినాయిస్‌తో పాటు ఇండియానా, అలబామా, టెన్నెస్సీల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో టోర్నడో కారణంగా బలమైన సుడిగాలులు వీస్తూ.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరాలు వర్షపు నీటిలో మునుగుతున్నాయి. టోర్నడో ధాటికి ఇళ్ల ముందున్న కార్లు కప్పుల్లా ఎగిరిపడ్డాయి. టెనెస్సీ కౌంటీలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది.

దాదాపు 50 మిలియన్ల మందికిపైగా టోర్నడో ప్రభావానికి గురైనట్లు ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ తెలిపింది. మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాలను తాకిన టోర్నడోల నుంచి కొందరు సురక్షితంగా బయటపడ్డారు. టోర్నడో ప్రభావంతో భవనాలు, చెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 రాష్ట్రాల్లో టోర్నడో ప్రభావం కనిపించింది. ఆర్కాన్సాస్ రాజధాని లిటిల్ రాక్ లో దాదాపు 2600 నిర్మాణాలకు టోర్నడో కారణంగా ముప్పు ఏర్పడినట్లు మేయర్ వెల్లడించారు.

గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో పెనుగాలులు విరుచుకుపడటంతో ఇండ్లు, షాపింగ్‌ మాల్స్‌ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.సుమారు 3 లక్షలకుపైగా ఇళ్లుకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అర్కన్సా స్టేట్‌లోని పలు సిటీల్లో టోర్నడో ధాటికి ఇళ్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి..

క్లింటన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు బాత్ రూంల్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు . మేంఫిస్, టెన్నెసీ, విన్ పట్టణంలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. వారం క్రితమే మిసిసిపి స్టేట్​లో టోర్నడో సంభవించి 26 మంది చనిపోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. మిసిసిపీతోపాటు అలబామా, టెన్నిస్సీ రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం