Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపిన అక్షయ్!

Akshay Kumar extends, చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపిన అక్షయ్!

తన తదుపరి చిత్రం ‘మిషన్ మంగళ్‌’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని జులై 22 ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చంద్రయాన్‌-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం అవుతోంది. అలాగే మిషన్ మంగళ్‌ చిత్రానికి, ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు ఇస్రో బృందం తరఫు నుంచి ఆల్‌ది బెస్ట్’ అని ఇస్రో ట్వీట్ చేసింది. దానిపై స్పందించిన అక్షయ్ కుమార్ ‘కృతజ్ఞతలు, చంద్రయాన్‌-2 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో బృందానికి మరోసారి బెస్ట్‌ ఆఫ్ లక్‌’ అని ఆయన సమాధానం ఇచ్చారు.

మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్‌ను అంగారకుడి మీదకు పంపించడంలో భారత శాస్త్రవేత్తల బృందం చేసిన కృషి నేపథ్యంలో మిషన్ మంగళ్‌ చిత్రం తెరకెక్కింది. దానికి సంబంధించి జులై 18న విడులైన ట్రైలర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు జగన్‌ శక్తి దర్శకత్వం వహించారు. విద్యాబాలన్‌, తాప్సి, సోనాక్షి సిన్హా, నిత్యా మీనన్‌, శర్మాన్‌ జోషి, కీర్తి కుల్హరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.