ఐరా తెలుగు మూవీ రివ్యూ

టైటిల్ : ఐరా తారాగణం : నయనతార, యోగిబాబు మరియు తదితరులు సంగీతం : సుందర మూర్తి దర్శకత్వం : సర్జున్ నిర్మాత : కేజే ఆర్ స్టూడియోస్   ఇంట్రడక్షన్: లేడి సూపర్‌ స్టార్ నయనతార రెండు విభిన్న పాత్రల్లో నటించిన తమిళ ఫ్యామిలీ హారర్ చిత్రం ‘ఐరా’. ఈ చిత్రానికి సర్జున్ దర్శకుడు. ఇక ఈ సినిమా అటు తమిళ తో పాటు ఇటు తెలుగులో కూడా రిలీజ్ అయింది.  మరి ఈ చిత్రం […]

ఐరా తెలుగు మూవీ రివ్యూ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2019 | 4:21 PM

టైటిల్ : ఐరా

తారాగణం : నయనతార, యోగిబాబు మరియు తదితరులు

సంగీతం : సుందర మూర్తి

దర్శకత్వం : సర్జున్

నిర్మాత : కేజే ఆర్ స్టూడియోస్

ఇంట్రడక్షన్: లేడి సూపర్‌ స్టార్ నయనతార రెండు విభిన్న పాత్రల్లో నటించిన తమిళ ఫ్యామిలీ హారర్ చిత్రం ‘ఐరా’. ఈ చిత్రానికి సర్జున్ దర్శకుడు. ఇక ఈ సినిమా అటు తమిళ తో పాటు ఇటు తెలుగులో కూడా రిలీజ్ అయింది.  మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు మనం ఈ రివ్యూలో చూద్దాం.

కథ‌ :

జర్నలిస్ట్ గా చేస్తున్న జాబ్ తో విసుగొచ్చి.. యూట్యూబ్ లో వీడియోలు చేసి పాపులర్ కావాలని అనుకుంటుంది యమున (నయనతార). అయితే ఈ విషయం గురించి తన బాస్ కు చెబితే.. ఆమె ఒప్పుకోదు. అంతేకాక ఈలోపు యమునకు తన తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది. దానితో ఆమె వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళిపోతుంది. ఇక ఆమె ఉంటున్న ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని నమ్మించి యూట్యూబ్ వీడియోలు తీయడం మొదలు పెడుతుంది.

ఇదిలా ఉంటే మరోవైపు అదే ఊరులో కొంతమంది అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడుతారు. కాగా ఈ హత్యలు అన్ని తన లవర్ భవాని(నయనతార) చేస్తోందని అనుకుంటాడు అభినవ్. ఈ క్రమంలో భవాని యమునను కూడా చంపాలనుకుంటుంది. అసలు ఎవరీ భవాని.? ఎందుకు యమునను చంపాలనుకుంది.? భవాని గతానికి.. యమునకు సంబంధం ఏమిటి.? మధ్యలో ఈ అభినవ్ ఎవరు.? అనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

న‌టీన‌టులు :

సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ హీరోయిన్ నయనతార. తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నయన్ తన సహజ నటనతో మెప్పించింది. అటు భవాని గా డి- గ్లామర్ రోల్ లో, ఇటు యమున గా గ్లామర్ రోల్ లో కనిపిస్తూ పూర్తి న్యాయం చేసింది. మొత్తానికి సినిమా అంతా వన్ మ్యాన్ షో చేసింది. మరోవైపు యోగిబాబు తన కామెడీ టైమింగ్ తో ఈసారి మెప్పించలేకపోయాడు.

విశ్లేష‌ణ‌ :

డైరెక్టర్ తీసుకున్న ఫ్యామిలీ హారర్ కాన్సెప్ట్ బాగున్నా అందులో సరైన కంటెంట్ లేకపోవడం తో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఇంటరెస్టింగ్ గా స్టార్ట్ చేసి.. సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి స్లో నెరేషన్ తో సినిమాపై ఆసక్తి పోగొట్టాడు. నయనతార తప్ప మిగిలిన పాత్రలేవి కూడా పెద్దగా రిజిస్టర్ కావు. ఇక డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం హారర్ పెట్టి.. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎక్కువ ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే శ్రద్ధ పెట్టడంతో ఇప్పటి యూత్ కు అది పెద్దగా ఎక్కదు. స్క్రిప్ట్ లో ఇంకొంచెం డెప్త్ ఉంటే మాత్రం సినిమా మరో స్థాయిలో ఉండేది.

సాంకేతిక విభాగాల పనితీరు:

సాంకేతిక విభాగాల పనితీరు ఫర్వాలేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా  హారర్ సన్నివేశాల్లో, విలేజ్ అందాలు చూపించడంలో కెమెరా పనితనం చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఇక కేజే ఆర్ స్టూడియోస్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

నయనతార నటన

ఫస్ట్ హాఫ్

మైనస్‌ పాయింట్స్‌ :

బోరింగ్ సెకండ్ హాఫ్

స్లో నెరేషన్

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో