Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘ఆయుధపూజ’పై కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ కౌంటర్!

రాఫెల్ యుద్ధ విమానానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆయుధ పూజ పేరుతో రక్షణ మంత్రి   ‘తమాషా’ చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. భారత వైమానిక దళం ఫ్రాన్స్ నుంచి నిన్న తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో విజయదశమి కూడా కావడంతో ఈ సందర్భంగా భారత సంప్రదాయం ప్రకారం రాజ్‌నాథ్ సింగ్ ‘ఆయుధ పూజ’ నిర్వహించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ…

‘‘అలాంటి తమాషాలు అవసరం లేదు. ఇంతకు ముందు మేము బోఫోర్స్ గన్ తెచ్చినప్పుడు… ఎవరూ అలా వెళ్లి ఆర్భాటాలు చెయ్యలేదు. ఆయుధాలు మంచివా, కావా అన్న విషయం తేల్చాల్సింది వైమానిక దళ అధికారులే. అలా కాకుండా వీళ్లే వెళ్లి, ఆర్భాటాలు చేసి, విమానంలో కూర్చుంటున్నారు..’’ అని పేర్కొన్నారు. యుద్ధ విమానం అప్పగింత కార్యక్రమానికి మతం కోణం చొప్పించడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు తొలి రాఫెల్ యుద్ధ విమానం నిన్న భారత వైమానిక దళానికి అందింది. ఈ సందర్భంగా రాజ్‌నాధ్ సింగ్ నిన్న ఈ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. విమానంపై ‘ఓం’ అని రాసి, కొన్ని పుష్పాలు, కొబ్బరికాయ పెట్టారు. అలాగే టైర్లు కింద నిమ్మకాయలు ఉంచారు. అనంతరం ఈ సన్నివేశాలను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. విజయ దశమి రోజు ఆయుధ పూజ చేయడం భారత సంప్రదాయమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

రాఫెల్ యుద్ధవిమానాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్‌లో అందుకుంటా దానికి ‘ఆయుధ పూజ’ జరపడంపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. సంప్రదాయాలపై పరిహాసం తగదన్నారు. ఆయుధపూజ అనేది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్టు కనిపిస్తోందని, విజయదశమినాడు ఆయుధపూజ చేసుకోరా? అని సూటిగా ప్రశ్నించారు. హర్యానాలోని కైతాల్‌లో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, ఆయుధపూజను పరిహసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పునరాలోచించుకోవాలని అన్నారు. సంప్రదాయాలపై పరిహాసం ఏమిటని నిలదీశారు.
అమిత్‌షా తన ప్రసంగంలో 370 ఆర్టికల్ రద్దు, కశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఆంక్షలు విధించడంపై కూడా మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి అసాధరణ నిర్ణయం తీసుకున్నాం. దేశాన్ని ఇంతవరకూ పాలించిన ఏ ఒక్కరూ దీన్ని సాధించలేకపోయింది. 370 అధికరణ అనేది రాజకీయ అంశం కానేకాదు. దేశ ఐక్యతను సాధించే అంశం. కానీ, దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది’ అంటూ షా మండిపడ్డారు. దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులను కాంగ్రెస్ ఆశిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ స్పష్టం చేయాలని అమిత్‌షా నిలదీశారు.