బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇక లేరు..

బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ దిగ్గ‌జ‌న‌టుడు రిషికపూర్ క‌న్నుముశారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇక లేరు..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 10:32 AM

బాలీవుడ్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ దిగ్గ‌జ‌న‌టుడు రిషికపూర్ క‌న్నుముశారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో భాద‌ప‌డుతున్న రిషి క‌పూర్ బుధ‌వారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రిలో చేర్పించారు. ముంబైలోని  రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషికపూర్ గురువారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు.  భార్య నీతూకపూర్,  రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆసుపత్రి వ‌ద్దే ఉన్నారు. రిషి మ‌ర‌ణ వార్త విని వారంతా శోక‌సంద్రంలో మునిగిపోయారు.

1952 సెప్టెంబ‌ర్ 4 రిషి ముంబైలో జ‌న్మించారు.. ప్ర‌ముఖ న‌టుడు రాజ్ క‌పూర్ కి రిషి రెండో కుమారుడు..మేరా నామ్ జోకర్ మూవీలో బాల‌న‌టుడిగా సినీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన రిషి బాబీ మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు.. ఆయ‌న అనేక హిట్ సినిమాల్లో న‌టించారు.. 1980లో స‌హ న‌టి రితూ సింగ్ ను ఆయ‌న వివాహం చేసుకున్నారు.. రిషికి ఇద్ద‌రు పిల్ల‌లు. కుమారుడు యంగ్ హీరో రణబీర్ కపూర్, కుమార్తె రిథిమా .. కాగా రిషి మ‌ర‌ణం పట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ చివరిసారిగా ఏప్రిల్ 2న ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్టారు. తన ఆరోగ్యం పట్ల కుటుంబం,అభిమానులు,స్నేహితులు చూపుతున్న శ్రద్దకు తాను చాలా సంతోషిస్తున్నానని అందులో తెలిపారు. అదే అత‌డి చివ‌రి పోస్ట్‌. ఇటీవలే తన కొత్త సినిమా ప్రాజెక్టును కూడా ప్రకటించారు. హాలీవుడ్‌లో చేయబోయే ‘ది ఇంటర్న్’ అనే ఆ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించబోతున్నారు. ఇంత‌లోనే ఈ దారుణం జ‌రిగిపోయింది.
ఏప్రిల్ 29 బుధ‌వారం బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృతిచెందిన షాక్ నుంచి ఇంకా ఎవ‌రూ బ‌య‌ట‌కు రాక‌ముందే…రిషి మ‌ర‌ణ‌వార్త వినాల్సి వ‌చ్చింది. ఇర్ఫాన్ ఖాన్ కూడా కొన్నేళ్లుగా  క్యాన్సర్‌  వ్యాధితో  పోరాటం చేస్తూనే మృతిచెందారు.  ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో బుధ‌వారం కన్ను మూశారు.  ఇర్ఫాన్ మృతి సినీ ప‌రిశ్ర‌మ‌నే కాక రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు రిషిక‌పూర్ లేడ‌నే వార్త చిత్ర ప‌రిశ్ర‌మ‌ని, అభిమానుల‌ను మ‌రింత కుంగ‌దీస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో