బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు, ముగ్గురు మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. శివకాశిలోని తులకనకుర్చి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా పేలుడు ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. వీరిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *