బిహార్​ గయా జిల్లాలో టెన్షన్..టెన్షన్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం

బీహార్‌లోని​ గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జోనల్‌ కమాండర్‌ అలోక్‌ యాదవ్‌ సహా ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు.

బిహార్​ గయా జిల్లాలో టెన్షన్..టెన్షన్.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం
Follow us

|

Updated on: Nov 22, 2020 | 11:45 AM

బీహార్‌లోని​ గయా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జోనల్‌ కమాండర్‌ అలోక్‌ యాదవ్‌ సహా ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని భారాచట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కోబ్రా కమాండోలు, బీహార్‌ పోలీసులు సంయుక్తంగా శనివారం సాయంత్రం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత గాలింపు బృందాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారని పోలీసులు వివరించారు. ఘటనాస్థలంలో ఏకే 47 రైఫిల్స్‌, ఇన్సాన్‌ రైఫిల్‌, మ్యాగజీన్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బారాఛట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి బలగాలు.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్