Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) లోని సిబ్బందికి కరోనా పాజిటివ్. దాదాపు 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. డీఎంఆర్‌సీ అధికారులు.
  • విశాఖ: క్రికెట్ గ్రౌండ్లో కత్తిపోట్లు. మూలపేట మైదానంలో యువకుల మధ్య వివాదం వ్యవహారం. ఆసుపత్రిలో నిలకడగా సాయి ఆరోగ్యం. 3 గంటలపాటు శ్రమించి వైద్యం చేసిన డాక్టర్లు. కత్తిపోటుకు విరిగిన దవడ కిందభాగం.. సాయి ముక్కు, నుదుటిపైనా గాయాలు.. చాతీ, వీపుపైనా కత్తిగాట్లు. దవడలో 6 సెంటీమీటర్ల వెడల్పు.. 3 సెంటీమీటర్ల లోతు గాయం. ఆందోళనలో కుటుంబసభ్యులు. సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సూర్య నుంచి మాకు ప్రాణ భయముంది.. : సాయి కుటుంబ సభ్యులు. పోలీసుల అదుపులో నిందితుడు సూర్య.
  • అమరావతి డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పోస్ హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ. సుధాకర్ పిటిషన్ ను అనుమతించిన కోర్టు హాస్పిటల్ superendent అనుమతి తో సుధాకర్ డిశ్చార్జ్ కావచ్చు సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్ ను ఆదేశించిన కోర్టు.

2838 మంది పాకిస్థానీలకు భారత పౌరసత్వం: నిర్మల సీతారామన్

Nirmala Sitharaman: Pakistanis, Afghans, Bangladeshis given Indian citizenship in last six years, 2838 మంది పాకిస్థానీలకు భారత పౌరసత్వం: నిర్మల సీతారామన్

పౌరసత్వ (సవరణ) చట్టం 2019 కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం మాట్లాడుతూ “గత ఆరు సంవత్సరాల్లో 2838 మంది పాకిస్తాన్ శరణార్థులు, 914 ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు, ముస్లింలతో సహా 172 బంగ్లాదేశ్ శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వబడింది అని సీతారామన్ తెలిపారు. 1964 నుండి 2008 వరకు 4,00,000 మందికి పైగా తమిళులకు (శ్రీలంక నుండి) భారత పౌరసత్వం ఇవ్వబడింది అని ఆమె అన్నారు.

“2014 వరకు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 566 మంది ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వబడింది. 2016-18లో మోదీ ప్రభుత్వంలో 1595 మంది పాకిస్తాన్ వలసదారులకు, 391 ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చారు.” అని ఆమె వివరించారు. “2016 లో అద్నాన్ సామికి భారత పౌరసత్వం ఇవ్వబడింది, తస్లీమా నస్రీన్ కు కూడా పౌరసత్వం ఇవ్వడం మరొక ఉదాహరణ” అని మంత్రి అన్నారు.

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నవీకరించబడుతుంది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) తో సంబంధం లేదు. కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని ఆమె అన్నారు. . ప్రభుత్వం ఎవరి పౌరసత్వాన్ని కొల్లగొట్టడం లేదని, “ఈ పౌరసత్వ (సవరణ) చట్టం ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించే ప్రయత్నం” గా చెప్పుకొచ్చారు.

Related Tags