చైనా యాప్‌లను నిషేధించండి: ట్రంప్‌కి అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల లేఖ
టిక్‌టాక్ సహా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించాలని 24 మంది కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యుల బృందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ
టిక్‌టాక్ సహా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించాలని 24 మంది కాంగ్రెస్ రిపబ్లికన్ సభ్యుల బృందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరింది. ఈ మేరకు ఓ లేఖను రాసిన వారు.. చైనా యాప్‌లను మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించాలని కోరారు. సైబర్ సెక్యూరిటీ చట్టాలను బట్టి, టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌తో సహా చైనా యాప్‌లు, సోషల్ మీడియా మాధ్యమాలు వారి వినియోగదారుల డేటాను అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి ఉంటుందని, ఇది దేశ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌ను ఫాలో అవ్వాలని రిపబ్లికన్ సభ్యుల బృందం వెల్లడించింది. ఇక దీనిపై వైట్‌హౌస్‌కి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై ప్రభుత్వం వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు. కాగా జాతీయ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అమెరికా కూడా చైనా యాప్‌లను నిషేధిస్తే.. డ్రాగన్ కంట్రీకి మరో గట్టి షాక్ తగిలినట్లే.