Breaking News
  • మనకు కావాల్సింది చంద్రబాబు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు-అవంతి విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌పై చంద్రబాబు అభ్యంతరం చెబుతున్నారు తుఫాన్లు వస్తాయి, నేవీ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారంటూ.. చంద్రబాబు తప్పు ప్రచారం చేస్తున్నారు-మంత్రి అవంతి శ్రీనివాస్‌. ఇతర ప్రాంతాలలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తాం. అమరావతిలో అలజడి సృష్టించి లబ్దిపొందాలని చంద్రబాబు చూస్తున్నారు -మంత్రి అవంతి శ్రీనివాస్‌.
  • విద్యుత్ చార్జీలు పెంచుతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం జగన్ ఆదేశించారు-మంత్రి బాలినేని. గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాల వల్ల.. విద్యుత్‌ రంగంలో రూ.40 వేల కోట్ల అప్పులు మిగిలాయి. పెన్షన్లపై కూడా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అనర్హులైనవి, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతున్న వారిని మాత్రమే తొలగించాం -మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

మోదీ@100 రోజుల పరిపాలన… ఏలా సాగిందంటే..!

00 days of Modi 2.0: A look at key decisions of the government, మోదీ@100 రోజుల పరిపాలన… ఏలా సాగిందంటే..!" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/09/Narendra-modi-Victory.jpg 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/Narendra-modi-Victory-300x180.jpg 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/Narendra-modi-Victory-768x461.jpg 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/09/Narendra-modi-Victory-600x360.jpg 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే అఖండ విజయాన్ని సాధించింది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికారం బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఇవాళ్టికి మోదీ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యింది. తొలిసారి అధికారం చేపట్టిన దానికంటే రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ చారిత్రక నిర్ణయాలుగా మిగిలిపోయేలా ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా వంద రోజుల్లోనే మోదీ తన మార్క్ పాలనను ప్రజలకు చూపించాడు. పటిష్టమైన ప్రభుత్వం ఉండటంతో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోడానికైనా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్తున్నారు. చారిత్రక సంస్కరణలు తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం సఫలమైంది. ట్రిపుల్ తలాక్, జమ్ముకశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాద నిరోధక చట్టం వంటి చట్టాలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం రాజకీయ చతురతను ప్రదర్శించింది. ఇక ఓ వైపు దేశంలో ఇలాంటి సంస్కరణలను తీసుకువస్తూ.. మరోవైపు విదేశీ వ్యవహారాలకు కూడా అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొదటి వంద రోజుల్లో 17 రోజులు విదేశీ పర్యటనల్లోనే గడిపారు. గతంలో ఏ ప్రధాని కూడా వెళ్లని దేశాల్లో మోదీ పర్యటించడం విశేషం.

విదేశీ టూర్‌లలో ఆర్థిక, రక్షణ, విద్యుత్తు వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటూనే.. అంతర్జాతీయ వేదికలపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎండగడుతూ.. పాక్‌ చేస్తున్న చర్యలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌ ఎంతగా గగ్గోలు పెట్టినా అంతర్జాతీయ సమాజం భారత్‌వైపే నిలబడి, ఆ దేశం వాదనను ఎవరూ పట్టించుకోకపోవడం మోదీ విదేశాంగ విధానం గొప్పతనమే.

ఇక నేటికి వంద రోజులు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచీ కొద్ది రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాల్లో కూడా రాజకీయ లాభం కోసం చూస్తూ.. ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ప్లాన్లు వేస్తుంది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి కొన్ని కీలక ప్రాజెక్టుల్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇలా అన్ని చోట్ల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే.. ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించేలా ప్లాన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం ఒకటి. దీని ద్వారా… వంట గ్యాస్ లేనివారికి కేంద్రం గ్యాస్ బండ, LPG కనెక్షన్ ఉచితంగా ఇస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 8 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే… 6 నెలల ముందుగానే లక్ష్యాన్ని చేరుకుంది.

2014తో చూస్తే.. ప్రస్తుతం మోదీ తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటున్నాయి. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాటలు. సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా… దూసుకెళ్తుంది. ప్రధానంగా… లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకోవడంతో.. పార్టీ వర్గాల్లో కూడా జోష్ మరింత పెరిగింది.

ప్రధానంగా మోదీ… ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా ఈ 100 రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ అంశంతోపాటూ… ముస్లిం మహిళలకు సంబంధించి ట్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారు. అయితే ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడానికి సరైన బలం లేకున్నా.. ప్రతిపక్ష పార్టీలతో తమదైన శైలిలో రాజకీయ చతురతను ఉపయోగించి.. బిల్లులకు ఆమోదం పొందేలా చేశారు. ఇక న్యాయపరమైన అంశాల్లో మరింత పారదర్శకత తెస్తూ… హైప్రొఫైల్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం అయ్యేలా, అవినీతిని కట్టడి చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆధునిక వైద్య వ్యవస్థను ఏకీకృతం చేస్తూ తీసుకున్న ఆయుష్ కార్యక్రమంతో పాటుగా.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్‌‌ను కఠినతరం చేస్తూ మోటార్ వాహన చట్టాన్ని సవరించారు.

అయితే… ఆర్థిక మాంద్యం కేంద్ర ప్రభుత్వానికి సవాళ్‌గా మారింది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ ఆర్థిక మాంద్యం సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉపశమన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. మోదీ తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం మండిపడ్డారు. ఇప్పటికైనా రాజకీయ దోరణి వీడి.. ఆర్థిక నిపుణుల సలహాలు స్వీకరించి సంక్షోభం నుంచి దేశాన్ని బయట వేయాలంటూ హితవు పలికారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. బ్యాంకుల విలీనం నిర్ణయంపై కూడా భిన్న వాదనలు వెలువడుతున్నాయి. మొత్తానికి దేశం ఉన్న ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి కేంద్రం ఎంతవరకూ దేశాన్ని గట్టెక్కిస్తుందో భవిష్యత్తులో తెలుస్తుంది.

Related Tags