పాత మోడళ్లు గురూ..! ధర తక్కువైనా.. స్మార్ట్ ఫోన్లది అదే జోరు..!

స్మార్ట్ ఫోన్లు.. ప్రస్తుతం వారానికో పది మోడళ్లు లాంచ్ అవుతున్నాయి. నిత్యం కస్టమర్లను ఆకర్షించేందుకు అప్‌డేట్ చేస్తూ సరైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు. అయితే వీటిలో చాలా మోడల్స్ లాంచ్ అయిన కొద్ది రోజులకే వాటి ధరలు తగ్గిపోతున్నాయి. కానీ అధునాతన ఫీచర్స్ ఉన్నవాటి ధరలు మాత్రం మారడం లేదు. తాజాగా వీటిలో కొన్ని మోడల్స్ మార్కెట్‌లోకి ఎంటరైన సమయంలో ఉన్న ధరలకంటే చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో […]

పాత మోడళ్లు గురూ..! ధర తక్కువైనా.. స్మార్ట్ ఫోన్లది అదే జోరు..!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 7:57 PM

స్మార్ట్ ఫోన్లు.. ప్రస్తుతం వారానికో పది మోడళ్లు లాంచ్ అవుతున్నాయి. నిత్యం కస్టమర్లను ఆకర్షించేందుకు అప్‌డేట్ చేస్తూ సరైన ఫీచర్స్‌తో కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి కంపెనీలు. అయితే వీటిలో చాలా మోడల్స్ లాంచ్ అయిన కొద్ది రోజులకే వాటి ధరలు తగ్గిపోతున్నాయి. కానీ అధునాతన ఫీచర్స్ ఉన్నవాటి ధరలు మాత్రం మారడం లేదు. తాజాగా వీటిలో కొన్ని మోడల్స్ మార్కెట్‌లోకి ఎంటరైన సమయంలో ఉన్న ధరలకంటే చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు.. వాటి ధరలను చూస్తే షాక్‌కు గురికావాల్సిందే.

1. ఆపిల్ ఐఫోన్ XR మోడల్ : ఈ మోడల్ గతేడాది నవంబర్‌లో లాంచ్ అయ్యింది. ప్రారంభ సమయంలో దీని ధర 76,900 ఉండగా.. ప్రస్తుతం 53,590/- కే లభిస్తోంది.

2. గూగుల్ పిక్సెల్ 3XL : ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో రూ. 83,000/- ఉండగా ప్రస్తుతం రూ. 52,724/-కే అందుబాటులో ఉంది.

3. షియోమీ Poco F1 : షియోమీ నుంచి విడుదలైన ఈ ఫోన్.. లాంచ్ టైంలో 21,999/- రూపాయలు ఉండగా ఇప్పుడు 17,999/-కే లభిస్తోంది.

4. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్9 : గతేడాది ఈ మోడల్ లాంచ్ అయ్యింది. అప్పుడు దీని ధర 57,900/- ఉండగా ఇప్పుడు 48 వేల రూపాయలకే లభిస్తోంది.

5. హానర్ 8X : హానర్ కంపెనీ నుంచి విడుదలైన 8ఎక్స్ మోడల్ లాంచ్ సమయంలో దీని ధర 17,999/- గా ఉంది. కానీ ఇప్పుడు రూ.11,999/- కే కస్టమర్లకు అందుబాటులో ఉంది.

6. షియోమీ (రెడ్ మీ) MiA2 : రెడ్ మీ నుంచి విడుదలైన MiA2 మోడల్ ధర ప్రారంభంలో 17,999/- గా ఉంది. కానీ ప్రస్తుతం ఇది పదివేలకే లభిస్తోంది.

7. అసూస్ జెన్‌ఫోన్ 5Z: అసూస్ నుంచి విడుదలైన 5Z ప్రారంభంలో రూ.32 వేలకు పైగా ఉంది. కానీ ప్రస్తుతం ఇది రూ.25 వేల లోపే లభిస్తోంది.

8. హానర్ ప్లే : హానర్ నుంచి వచ్చిన హానర్ ప్లే మోడల్ ప్రారంభంలో దీని ధర రూ.19991/- గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఇది రూ.14వేల లోపే కస్టమర్లకు అందుబాటులో ఉంది.

9. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌8 : శామ్‌సంగ్ నుంచీ గెలాక్సీ నోట్ సీరీస్‌లో విడుదలైన నోట్8 ప్రారంభంలో ధీని ధర 68వేలు ఉంది. కానీ ఇప్పుడు ఇది కేవలం రూ.31 వేలకే లభిస్తోంది.

10. ఆపిల్ ఐఫోన్ 6S : ఆపిల్ నుంచి విడుదలైన ఐఫోన్ 6S తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.28,999/- కే కొనగోలుదారులకు అందుబాటులో ఉంది.

చూశారు కదా.. పాత స్మార్ట్ ఫోన్ల ధరలు. లాంచ్ సమయంలో ఉన్నప్పుడు ఎంత ఉన్నాయో.. ప్రస్తుతం ఏ ధరకు లభిస్తున్నాయో.. ఇక ఏం కావలో నచ్చినవి చూసి కొనుక్కొండి.