Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

చంద్రబాబు ఎంతటి “సమర్థులో”.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

YCP MP Gorantla Madhav Fires On Chandrababu, చంద్రబాబు ఎంతటి “సమర్థులో”.. గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కియాపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ నన్ను హత్య చేశారని.. నేను ఆత్మగా తిరుగుతున్నానని.. ప్రజలను నమ్మించగల సమర్ధుడు చంద్రబాబు అంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. కియా సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని.. ఇంకా ఏం కావాలో చెప్పండని సంస్థను జగన్ సర్కార్ అడుగుతోందన్నారు. మా ప్రాంత వాసులకు ఉద్యోగాలు కల్పించండని కియాను కోరామని.. ఇంకా స్థలం విషయంలో కానీ.. ఇతర అవసరాల విషయంలో అన్ని సహకారాలు చేస్తామని తెల్పినట్లు స్పష్టం చేశారు.

Related Tags