టీడీపీ ట్రాక్‌లో పడకుండా బీజేపీ సహకరించాలి: రామచంద్రయ్య

టీడీపీ ట్రాక్‌లో పడకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ రామచంద్రయ్య అన్నారు. సంక్షేమ పథకాల అమలులో పొరపాట్లు సర్వసాధరణమన్నారు. ఏపీ రాష్ట్రాన్ని అవినీతితో పెంచి పోషించింది చంద్రబాబు అని ఆరోపించారు. దివాళాలోవున్న రాష్ట్రాన్ని.. వైసీపీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. టీడీపీ వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ఇసుక పాలసీ విధి విధానాలకు కొంతమేర సమయం అవసరమన్నారు. పీపీఎం, కాంట్రాక్టుల వల్ల ప్రజలు నష్ట పడటంలేదన్నారు. ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.

కాగా.. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేస్తే దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే బీజేపీకి మద్దతిచ్చామన్నారు. ఎకనామిక్ టెర్రరిస్టులను పార్టీలో చేర్చుకుంటే బీజేపీ ఇబ్బందులు పడక తప్పదన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. రాజధాని విషయంలో కూడా దళారులను పెంచి పోషించారని విమర్శించారు. అలాగే.. రాజధాని ప్రాంత రైతులను బాబు దగా చేశారని.. దోపిడీ వ్యవస్థకు నీళ్లు పోసి పెంచారని అన్నారు. బాబు అనుమతి లేకుండానే రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేర్చారా..? అని ప్రశ్నించారు వైసీపీ నేత సీ రామచంద్రయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *