ఎన్నికల ప్రచారంలో గ్రేట్ ఖలీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ గ్రేట్ ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన స్నేహితుడికి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఇది పశ్చిమ్ బంగాలోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో కనిపించిన దృశ్యం. బీజేపీ ఎంపీ అభ్యర్థి, తన స్నేహితుడు అనుపమ్ హజ్రా తరపున ఖలీ ప్రచారం చేశారు. అనుపమ్.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత. బోల్‌పూర్ ఎంపీ అయిన ఆయన.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో బహిష్కరించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన అనుపమ్.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. […]

ఎన్నికల ప్రచారంలో గ్రేట్ ఖలీ
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2019 | 8:15 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ గ్రేట్ ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన స్నేహితుడికి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఇది పశ్చిమ్ బంగాలోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో కనిపించిన దృశ్యం. బీజేపీ ఎంపీ అభ్యర్థి, తన స్నేహితుడు అనుపమ్ హజ్రా తరపున ఖలీ ప్రచారం చేశారు. అనుపమ్.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత. బోల్‌పూర్ ఎంపీ అయిన ఆయన.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో బహిష్కరించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన అనుపమ్.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్‌షోలో ఖలీ పాల్గొని.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖలీ తనకు మంచి స్నేహితుడని, తనకోసం కోల్‌కతా వచ్చాడని అనుపమ్ చెప్పారు. అనుపమ్ హజ్రాపై పోటీగా తృణమూల్ తరపున ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తి బరిలో నిలిచారు.