Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

కరోనా లాక్‌డౌన్: దేశవ్యాప్తంగా తగ్గిన కాలుష్యం..!

World’s Dirtiest Air, కరోనా లాక్‌డౌన్: దేశవ్యాప్తంగా తగ్గిన కాలుష్యం..!

ఓ వైపు కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని ఆరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపు మేరకు మార్చి 23వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైలు, విమానాలతో పాటు ఇతర వాహనాల వాడకం కూడా తగ్గిపోయింది. అంతేకాక, ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా కాలుష్యం శాతం కూడా తగ్గిపోయింది.

కోవిద్ 19 ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. గత ఏడాది(2019) ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 20 అత్యంత కలుషిత నగరాల్లో 14 నగరాలు భారతదేశానికి చెందినవే. అయితే ఏప్రిల్ 7వ తేదీన వచ్చిన నివేదిక ప్రకారం.. ఈ సంఖ్య కేవలం రెండుకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ముంబై, కోల్‌కతా మాత్రమే అత్యంత కలుషిత నగరాలుగా నిలిచాయి. అయితే లాక్‌డౌన్ అమలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపించినా.. కాలుష్యాన్ని మనం అదుపు చేయవచ్చనే విషయాన్ని రుజువు చేసిందని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

కాగా.. కేంద్ర కాలుష్య నివారణ శాఖ పర్యవేక్షిస్తున్న 103 నగరాల్లో లాక్‌డౌన్ సమయంలో 90శాతం కాలుష్యం తగ్గినట్లు నిర్ధారణ జరిగింది. గాలిలో కాలుష్య శాతం తగ్గడం వల్ల నిమోనియా వంటి వ్యాధులు సోకే అవకాశాలు తగ్గుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ ఏడా దాదాపు ఏడు మిలియన్ల మంది కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థకంటే కూడా కలుష్యాన్ని తగ్గించడం ఎంతో ముఖ్యమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

Related Tags