
అక్కడున్న వారంతా పలు దేశాలకు సంబంధించిన అగ్రనేతలు.. కానీ.. అక్కడ ఓ సరదా సన్నివేశం జరిగింది.. ఓ మహిళా ప్రధానమంత్రికి.. మరో దేశ అధ్యక్షుడు.. ఓ సలహా ఇవ్వడం వైరల్‌గా మారింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నవ్వుతూ కనిపించడంతోపాటు.. పలు సరదా వ్యాఖ్యలు చేశారు.
ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్ శాంతి సదస్సులో ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు సహా ప్రపంచ నాయకులు తీవ్ర చర్చలు జరిపారు. యుద్ధం విరమణ, గాజాలో శాంతి కోసం.. పలు తీర్మానాలు కూడా చేశారు.. ఈ క్రమంలోనే.. ప్రపంచ నేతల మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్.. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడారు.. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా ఉన్నారు. ఈ వీడియోలో.. ఎర్డోగాన్ నవ్వుతూ మెలోనీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమెతో సరదాగా సంభాషించారు..
🇹🇷🇮🇹 ERDOGAN TO MELONI: I HAVE TO MAKE YOU STOP SMOKING
Erdogan:
“I saw you coming down from the plane.
You look great.
But I have to make you stop smoking.”
Meloni:
“I know, I know.
I don’t want to kill somebody”
Source: @ihacomtr https://t.co/FX7G3CR5g1 pic.twitter.com/glcfOZAA6Z
— Mario Nawfal (@MarioNawfal) October 13, 2025
మీరు విమానం నుంచి దిగుతుండగా మిమ్మల్ని చూశాను.. మీరు చాలా అద్భుతంగా.. చాలా అందంగా ఉన్నారు. కానీ నేను మిమ్మల్ని ధూమపానం (సిగరెట్ తాగడం) మానేయమని కోరుతున్నా.. అంటూ ఎర్డోగన్ చమత్కరించారు..
వెంటనే నవ్వుతూ స్పందించిన మెలోని.. నాకు తెలుసు, నేను ఎవరినీ చంపాలనుకోవడం లేదు.. అంటూ బదులిచ్చారు..
అయితే.. పక్కనే నిలబడి వారిద్దరి సంభాషణను విన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ నవ్వుతూ.. జోక్యం చేసుకున్నారు. ఇది అసాధ్యం అంటూ బదులు ఇచ్చారు.
కాగా.. ఇటలీ ప్రధాని మెలోనీ గతంలో 13 ఏళ్ల పాటు సిగరెట్ తాగడం మానేసి.. ఇటీవలే తిరిగి ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..