కోవిడ్-19 ఎఫెక్ట్.. వూహాన్ హాస్పిటల్ డైరెక్టర్ మృతి.. ఇక సామాన్యులకేదీ దిక్కు ?

చైనాలోని వూహాన్ నగరాన్ని కబళిస్తున్న కరోనా (కోవిడ్-19) ఏకంగా ఓ హాస్పిటల్ డైరెక్టర్నే బలిగొంది.   ఈ సిటీలోని ‘వూచాంగ్ ఆసుపత్రి’ డైరెక్టర్లియు జిమింగ్ ఈ వ్యాధికి గురై మంగళవారం మరణించాడు.  ఇలా ఒక ఆసుపత్రి డైరెక్టరే ఈ వ్యాధిగ్రస్తుడై మృతి చెందడం ఇదే మొదటిసారి. మరో ఆరుగురు మెడికల్ వర్కర్లు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా-లియు మృతికి సంబంధించిన వార్తలు మంగళవారం అర్ధరాత్రి సర్క్యులేట్ కాగా- ఆ తరువాత వాటిని […]

కోవిడ్-19 ఎఫెక్ట్.. వూహాన్ హాస్పిటల్ డైరెక్టర్ మృతి.. ఇక సామాన్యులకేదీ దిక్కు ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2020 | 12:48 PM

చైనాలోని వూహాన్ నగరాన్ని కబళిస్తున్న కరోనా (కోవిడ్-19) ఏకంగా ఓ హాస్పిటల్ డైరెక్టర్నే బలిగొంది.   ఈ సిటీలోని ‘వూచాంగ్ ఆసుపత్రి’ డైరెక్టర్లియు జిమింగ్ ఈ వ్యాధికి గురై మంగళవారం మరణించాడు.  ఇలా ఒక ఆసుపత్రి డైరెక్టరే ఈ వ్యాధిగ్రస్తుడై మృతి చెందడం ఇదే మొదటిసారి. మరో ఆరుగురు మెడికల్ వర్కర్లు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా-లియు మృతికి సంబంధించిన వార్తలు మంగళవారం అర్ధరాత్రి సర్క్యులేట్ కాగా- ఆ తరువాత వాటిని డిలీట్ చేశారు. వాటి స్థానే.. డాక్టర్లు ఆయనకు ఇంకా చికిత్స చేస్తున్నారనే సమాచారంతో వాటిని భర్తీ చేశారు. అయితే చివరకు ఆయన మరణాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ గురించి మొదట వెలుగులోకి తెచ్చిన నేత్ర వైద్యుడు లీ వెన్లియాంగ్ ను అధికారులు గత డిసెంబరులో శిక్షించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన మరణించాడు.

ఇప్పుడు లియు మరణాన్ని కూడా ఆ డాక్టర్ మృతితో ముడి పెడుతున్నారు. అపుడే జాగరూకత వహించి ఉంటే ఈ వైరస్ ఇంతగా ప్రబలి ఉండేది కాదని అంటున్నారు. లీ మృతికి, లియాంగ్ మరణానికి లింక్ పెడుతూ.. సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అధికారుల వైఖరిని తప్పు పడుతున్నారు. ఇలా ఉండగా.. చైనాలో ఈ వ్యాధికి గురై మరణించిన వారి సంఖ్య 1900 కి పైగా పెరగగా.. 72 వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు సోకాయని తెలుస్తోంది.