Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వ్యవహార శైలిపై పలువురు విరుచుకుపడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీమ్ బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీరుపై తస్లీమా విమర్శలతో విరుచుకు పడ్డారు. ట్విట్టర్ వేదికగా తస్లీమా తన విమర్శల దాడి సాగించారు.
మంటల్లో బూడిద అవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫోటోను తస్లీమా షేర్ చేశారు. ఆ ఫోటోకి ఇచ్చిన క్యాప్షన్ లో ..హిందువుల గ్రామాలు తగలబడుతుంటే..బంగ్లాదేశ్ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆదివారం(అక్టోబర్-17)రాత్రి బంగ్లాదేశ్ లోని పిర్గంజ్, రంగాపూర్ జిల్లాల్లోని రెండు హిందూ గ్రామాలను జీహాదీలు తగులబెట్టారని తస్లీమా తెలిపారు.. వేలాది మంది హిందువులు.. ఇళ్లు కూల్చివేయబడి లేదా దగ్ధమైన తర్వాత నిరాశ్రయులయ్యారని..కానీ షేక్ హసీనా మాత్రం ఇవాళ ఆమె సోదరుడు షేక్ రస్సెల్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుందని తస్లీమా విమర్శించారు.
తస్లీమా చేసిన ట్వీట్ ఇదే..
Last night in Pirganj, Rangpur, Bangladesh. Two Hindu villages were burnt down by jihadis. Hasina was playing flute. pic.twitter.com/ErRQQcbhH5
— taslima nasreen (@taslimanasreen) October 18, 2021
కాగా, గత వారం దుర్గా పూజ సందర్భంగా ఆలయ విధ్వంస ఘటనలతో బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఓ గ్రామంలో అరవై ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 20 హిందువుల ఇళ్లను దహనం చేశారు. రాజధాని నగరం ఢాకాకు 255 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. గ్రామానికి చెందిన ఒక హిందూ యువకుడు ఫేస్‌బుక్ పోస్ట్‌లో మతాన్ని అగౌరవపరిచాడని పుకారు రావడంతో పోలీసులు మత్స్యకారుల కాలనీకి వెళ్లారు. పోలీసులు ఆ వ్యక్తి ఇంటి చుట్టూ కాపలాగా ఉండడంతో, దాడి చేసిన వారు సమీపంలోని ఇతర ఇళ్లకు నిప్పుపెట్టారని తెలిసింది.
ఫైర్ సర్వీస్ కంట్రోల్ రూమ్ మాజిపారాలో 29 నివాస గృహాలు, రెండు వంటశాలలు, రెండు బార్న్‌లు, 20 గడ్డివాములను తగలబెట్టినట్లు పేర్కొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజాము 4:10 వరకు మంటలను ఆర్పివేశారని స్థానికి మీడియా పేర్కొంది. ప్రాణనష్టం గురుంచి ఎలాంటి సమాచారం లేదు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి.
Food Habits: బీ కేర్‌ఫుల్! ఆహారంలో ఈ పదార్ధాలను కలిపి తీసుకుంటే కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్టే..
Senior Citizens: అరవై ఏళ్ళు దాటినా.. అలుపెరుగని పరుగులు.. జపాన్‌లో వృద్ధుల జీవన శైలి అదరహో!