World Largest Ship: ప్రయాణాలు అంటే ఇష్టం ఉన్నవారికి అందులోనూ సముద్ర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఓ పెద్ద శుభవార్త. పెద్ద అని ఎందుకు చెబుతున్నామంటే.. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ ఓడలో ప్రయాణానికి టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సిద్ధం చేసిన ఈ అతిపెద్ద ఓడ మార్చి 2022 లో తన తొలి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ ప్రయాణానికి వాళ్ళు ‘వండర్ ఆఫ్ ది సీస్’ అని పేరు పెట్టారు. ఇందులో ప్రయాణించాలంటే ఒకరికి ఒకటిన్నర లక్షల రూపాయల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకూ టికెట్ ఖర్చు అవుతుంది. అదే..4 మంది కుటుంబ సూట్ కోసం సుమారు 27.5 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రాయల్ కరేబియన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రయాణం మొత్తం 9 రాత్రులు.. 8 పగళ్ళు ఉంటుంది. షాంఘై నుంచి జపాన్ వరకూ సాగే ఈ సముద్ర యానం టోక్యో, మౌంట్ ఫుజి, కుమామోటో, కగోషిమా, ఇషిగాకి అలాగే మియాజాకి వంటి ఓడరేవుల గుండా వెళుతుంది. మార్చి నుంచి నవంబర్ వరకూ ఈ యాత్ర ఇలానే నడుస్తుంది. ఆ తరువాత అంటే.. నవంబర్ 2022 నుంచి జనవరి 2023 వరకూ ఇది ఆసియాలోని టాప్ రేటెడ్ ప్రదేశాలకు కూడా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. వీటిలో దక్షిణ కొరియా,వియత్నాం కూడా ఉన్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం అలాగే ఇతర సెలవులకోసం, వియత్నాం లోని చాన్, దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, జెజుల నుంచి ఈ ఓడ ప్రయాణాలు సాగిస్తుంది.
ఈ భారీ ఓడకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే..
Also Read: Viral News: వింత దేశం: ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వరుడు తిమింగలం చేపల పళ్ళు తీసుకురావాలి
Coronavirus Vaccine: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కీలక నిర్ణయం.. అందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్..