కుక్కలు చాలా విశ్వాస పాత్రమైనవని, తమ యజమానులను కంటికి రెప్పలా కాపాడుతాయని అంటారు. కానీ అన్ని శునకాలకూ ఈ సూత్రం వర్తించదని తేలిపోయింది. బ్రిటన్..లోని బర్మింగ్ హాం లో 25 ఏళ్ళ యువతిని ఆమె ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న కుక్కే కరిచి..కరిచి చంపేసింది.. తీవ్ర గాయాలకు గురైన ఆమె ఎలాంటి చికిత్సకూ నోచుకోకుండానే మృతి చెందడం స్థానికులను దిగ్భ్రాంతి పరచింది. కీరా లాడ్ లో అనే ఈ మహిళ తన ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుండగా ఈమె పెంపుడు శునకం ఒక్కసారిగా దాడి చేసి.. ఆమె చేతిని కొరికివేసింది. కీరా మణికట్టు తెగినంత పనై ఆమె బాధతో విలవిలలాడుతుండగా ఈ జాగిలం కూడా భయంకరంగా మొరుగుతూ ఆమె శరీరంలో పలు చోట్ల గోళ్లు, పళ్లతో రక్కివేసింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె బాధతో పెట్టిన కేకలు ఎవరికీ వినిపించలేదు.
నాలుగేళ్ల క్రితం తను లోగడ ఇష్టంగా పెంచుకున్న డాగ్ మరణించడంతో ఓ గార్డెన్ లో కూనగా ఉన్న ఈ వీధికుక్కను కీరా రక్షించి ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నట్టు తెలిసింది. చివరకు అది ఇలా తన విశ్వాస రాహిత్యాన్ని, కుక్కబుధ్డిని ప్రదర్శించుకుంది. పోలీసులు వఛ్చి ఈ ‘హంతక’ శునకాన్ని పట్టుకుపోయి కాల్చి చంపారు.