Viral: భార్య చేసిన ‘ఆ పని’తో భర్తకు ఫ్యూజులౌట్.. పెళ్లై 26 ఏళ్లకు ఊహించని ట్విస్ట్..అసలేం జరిగిందంటే?

|

Nov 24, 2022 | 12:50 PM

ఆ ఇద్దరికీ పెళ్లై 26 ఏళ్లు అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. లైఫ్ అంతా సాఫీగానే సాగుతోంది. ఇదే క్రమంలో అతడికి అదృష్టం వరించి..

Viral: భార్య చేసిన ఆ పనితో భర్తకు ఫ్యూజులౌట్.. పెళ్లై 26 ఏళ్లకు ఊహించని ట్విస్ట్..అసలేం జరిగిందంటే?
International News
Follow us on

ఆ ఇద్దరికీ పెళ్లై 26 ఏళ్లు అయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. లైఫ్ అంతా సాఫీగానే సాగుతోంది. ఇదే క్రమంలో అతడికి అదృష్టం వరించి.. కోట్లలో లాటరీ తగిలింది. ఆ డబ్బును అతడు తన భార్య అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. కానీ ఆమె మాత్రం అతడికి దిమ్మతిరిగే షాకిచ్చింది. పెళ్ళైన 26 ఏళ్ల తర్వాత భార్య చేసిన పనికి దెబ్బకు ఖంగుతిన్నాడు భర్త. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటు చేసుకోగా.. ఆ వివరాల్లోకి వెళ్తే..

మనిత్, అంగనారత్ భార్యభర్తలు. వీరిద్దరికీ పెళ్లై 26 ఏళ్లు అయింది. థాయ్‌లాండ్‌లోని ఇసాన్ ప్రావిన్స్‌లో నివాసముంటున్న వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొన్నటి వరకు లైఫ్ అంతా బాగానే సాగింది. ఈ క్రమంలోనే మనిత్‌కు లాటరీ తగలడం.. కోట్లు వచ్చిపడటంతో.. వారి ఆర్ధిక పరిస్థితి కూడా బాగుపడింది. నవంబర్ 1వ తేదీన మనిత్ సుమారు రూ. 1.35 కోట్లు లాటరీ రూపంలో గెలుచుకున్నాడు. ఇక ఆ డబ్బును తీసుకెళ్లి తన భార్య అంగనారత్ అకౌంట్‌లో డిపాజిట్ చేశాడు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా భార్య అతడికి ఫ్యూజులు ఎగిరిపోయేలా షాకిచ్చింది. ఆ డబ్బుతో ఆమె తన ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో దెబ్బకు కంగుతిన్న భర్త.. ఏం చేయాలో తెలియక.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.