Iran Lady: హిజాబ్‌ ధరించలేదని పోలీసుల టార్చర్‌.. కోమాలోంచే కన్నుమూసిన యువతి..!

Iran Lady: హిజాబ్ రూల్ యువతి ప్రాణం తీసింది. హిజాబ్ ధరించలేదని యువతిని దారుణంగా కొట్టారు పోలీసులు.

Iran Lady: హిజాబ్‌ ధరించలేదని పోలీసుల టార్చర్‌.. కోమాలోంచే కన్నుమూసిన యువతి..!
Iran
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:06 AM

Iran Lady: హిజాబ్ రూల్ యువతి ప్రాణం తీసింది. హిజాబ్ ధరించలేదని యువతిని దారుణంగా కొట్టారు పోలీసులు. వారి దెబ్బలకు కోమాలోకి వెళ్లిన యువతి.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇరాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్‌ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. హిజాబ్‌ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ ఘటన ఇరాన్‌ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. మహ్‌సా అమినీ తన కుటుంబంతో టెహ్రాన్‌ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్‌ ధరించకపోవడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. అమినీ కోమాలోకి వెళ్లిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు ఆమె కన్నుమూసినట్లు ప్రకటించారు.

అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. పోలీస్‌ స్టేషన్‌కు ఆమెను తరలించినప్పటి నుంచి ఆస్పత్రిలో చేర్చే వరకు ఏం జరిగిందో ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్‌ఛానెల్‌ మాత్రం.. కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. కస్టడీలో ఆమె హింసకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే అమినీతో పాటు మతపరమైన డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించిన కొందరిని స్టేషన్‌కు తరలించామని, సందర్శకుల హాలులో ఉన్న టైంలో ఆమె ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పిన వైద్యులు.. మరణించిందని ప్రకటించారని పోలీసులు ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..