Viral Video: అయ్యో.. పాపం బైడెన్‌! విమానం ఎక్కుతుండగా స్లిప్‌ అయ్యి.. ముందుకు ఒరిగిపోయి..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (80) బుధవారం (ఫిబ్రవరి 22) ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా స్లిప్‌ అయ్యి ముందుకు ఒరిగిపోయి దాదాపు పడిపోయినంత..

Viral Video: అయ్యో.. పాపం బైడెన్‌! విమానం ఎక్కుతుండగా స్లిప్‌ అయ్యి.. ముందుకు ఒరిగిపోయి..
Joe Biden Stumbled

Updated on: Feb 23, 2023 | 6:37 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (80) బుధవారం (ఫిబ్రవరి 22) ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా స్లిప్‌ అయ్యి ముందుకు ఒరిగిపోయి దాదాపు పడిపోయినంత పనైంది. చేతులతో మెట్లు పట్టుకుని నిలదొక్కుకుని యథాప్రకారం మళ్లీ మెట్లు ఎక్కుతూ విమానం పైకి చేరుకున్నారు. తర్వాత చేతితో అభివాదం చేసి విమానం లోపలికి ప్రవేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. బిడెన్ తనను తాను పట్టుకునే ముందు మెట్ల పైభాగంలో పడిపోయినట్లు చూపిస్తుంది. ఆ తర్వాత అలవోకగా మారి విమానంలోకి ప్రవేశించాడు. ఉక్రెయిన్, పోలాండ్‌లను సందర్శించేందుకు ఆయన తన పర్యటన ముగించుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.

విమానం ఎక్కుతూ మెట్లు జారి బైడెన్ పడిపోవడం ఇదేం తొలిసారి కాదు. 2021లో జార్జియా వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ బైడెన్ రెండుసార్లు తడబడినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఎక్కేక్రమంలో బైడెన్ అధ్యక్షుడు జారిపడడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఉక్రెయిన్, పోలాండ్‌ ఆకస్మిక పర్యటనల అనంతరం ఆయన తన పర్యటన ముగించుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us