Independence Day: అంతరిక్షంలో ‘జయహో’ భారత్.. గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరిన త్రివర్ణ పతాకం..

|

Aug 15, 2022 | 9:35 AM

భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తై..వజ్రోత్సవాలు చేసుకుంటున్న వేళ.. అంతరిక్షంలో అద్భుతం చోటుచేసుకుంది. గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో జాతీయ జెండా

Independence Day: అంతరిక్షంలో జయహో భారత్.. గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరిన త్రివర్ణ పతాకం..
Space
Follow us on

Independence Day: భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తై..వజ్రోత్సవాలు చేసుకుంటున్న వేళ.. అంతరిక్షంలో అద్భుతం చోటుచేసుకుంది. గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో జాతీయ జెండా ఎగిరింది. స్పేష్ కిడ్జ్ ఇండియా సంస్థ ఈజెండాను అంతరిక్షంలో ఆవిష్కరించింది. యువ శాస్త్రవేత్తలను తయారుచేసే ఈసంస్థ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ.. హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రహం నెంచి దాదాపు 1,06,000 అడుగుల ఎత్తులో ఉన్న బెలూన్ లో జాతీయ జెండాను పంపించి.. అంతరిక్షంలోనూ త్రివర్ణపతకాన్ని రెపరెలాడించారు. దేశంలో యువ శాస్త్రవేత్తలను తయారుచేయడం, పిల్లల్లో విషయ పరిజ్ఞానం పెంచుతూ.. సరిహద్దులు లేని ప్రపంచం కోసం అవగాహన కల్పించడం కోసం స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ ఇటీవలే లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. AzadiSAT పేరుతో దేశంలోని 750 మంది బాలికలచే 75 వసంతాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గుర్తుగా ఈశాటిలైట్ ను అభివృద్ధి చేశారు. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈప్రయోగం విఫలమైంది.

భారత్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. తరిక్షం నుండి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో పని చేస్తున్న వ్యోమగామి సమంతా క్రిస్టోఫోరెట్టి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ.. భారత్ కు 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఇండో-అమెరికన్ వ్యోమగామి రాజా చారి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నాసా, ఇస్రో మధ్య సహకారం సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..