జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి నోరు పారేసుకున్నారు. నీ మూతి వాయగొడతానంటూ జర్నలిస్ట్‌లపై ఫైర్ అయ్యారు.

జర్నలిస్ట్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ఫైర్‌

Updated on: Aug 24, 2020 | 12:59 PM

Brazilian President Jair Bolsonaro: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి నోరు పారేసుకున్నారు. నీ మూతి వాయగొడతానంటూ జర్నలిస్ట్‌లపై ఫైర్ అయ్యారు. దీంతో ఆయనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల బ్రెసిలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రాల్ పర్యటనకు బోల్సొనారో వెళ్లారు. అక్కడ ఓ జర్నలిస్ట్‌ బోల్సొనారో భార్య మిచెల్లి బోల్సొనారోపై వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన బోల్సొనారో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మూతి పగులగొడతానంటూ అతడిపై విరుచుకుపడ్డారు. వెంటనే అక్కడున్న జర్నలిస్టులు నిరసనలకు దిగారు. అయితే వీటిని పట్టించుకోకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు జర్నలిస్ట్‌కి జైర్ బోల్సొనారో బెదిరింపులపై అతడు పనిచేస్తోన్న పత్రిక స్పందించింది. ఒక ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధ్యక్షుడు తన కర్యవ్యాన్ని విస్మరించారని పత్రిక యాజమాన్యం మండిపడింది. ఆ జర్నలిస్ట్‌కు తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది. అయితే ఓ బోల్సొనారో సన్నిహితుడు ఫాబ్రిసియో క్యూరేజ్‌, మిచెల్లి మధ్య అక్రమ లావాదేవీలపై అక్కడి ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై మిచెల్లి కూడా ఇంకా ఏం స్పందించలేదు.

Read More:

ప్రభాస్-నాగ్‌ అశ్విన్‌ మూవీలో ఇస్మార్ట్ బ్యూటీ!

సుశాంత్‌కి రియా ఇచ్చే మందులు హైడోసేజ్‌తో ఉండేవి

Loading...
Unable to load recommendations.
Follow Us