Viral Video: వామ్మో ఇదేం స్టంట్‌ తల్లీ! వెరైటీగా మొక్కజొన్న తినాలనుకుంది.. జుట్టు ఊడగొట్టుకుంది!

|

Oct 02, 2023 | 4:28 PM

స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకొచ్చాక యవత వింత వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి ఎంతటి ఘాతుకానికైనా వెనడాడడం లేదు. లైకులు, కామెంట్ల కోసం విచక్షణ కొల్పోయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఓవర్‌ నైట్‌ స్టార్ అయిపోవాలనో.. నేమ్‌ ఫేమ్‌ కోసమో తెలియదు గానీ వింత వీడియోలు చేస్తూ ఎందరో నూరేళ్ల జీవితానికి చరమగీతం పాడుతున్నారు. తాజాగా ఓ యువతి అలాంటి ప్రయత్నమే చేసి త్రుటిలో ప్రాణాలు కాపడుకుంది. కెమెరా ముందు మొక్కజొన్న తినడానికి ప్రయత్నించి జుట్టు ఊడగొట్టుకుంది. తర్వాత చేసిన తప్పు గ్రహించి తనలా..

Viral Video: వామ్మో ఇదేం స్టంట్‌ తల్లీ! వెరైటీగా మొక్కజొన్న తినాలనుకుంది.. జుట్టు ఊడగొట్టుకుంది!
Rotating Corn Challenge
Follow us on

చైనా, అక్టోబర్‌ 2: స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకొచ్చాక యవత వింత వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి ఎంతటి ఘాతుకానికైనా వెనడాడడం లేదు. లైకులు, కామెంట్ల కోసం విచక్షణ కొల్పోయి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఓవర్‌ నైట్‌ స్టార్ అయిపోవాలనో.. నేమ్‌ ఫేమ్‌ కోసమో తెలియదు గానీ వింత వీడియోలు చేస్తూ ఎందరో నూరేళ్ల జీవితానికి చరమగీతం పాడుతున్నారు. తాజాగా ఓ యువతి అలాంటి ప్రయత్నమే చేసి త్రుటిలో ప్రాణాలు కాపడుకుంది. కెమెరా ముందు మొక్కజొన్న తినడానికి ప్రయత్నించి జుట్టు ఊడగొట్టుకుంది. తర్వాత చేసిన తప్పు గ్రహించి తనలా మరెవ్వరూ అలాంటి స్టంట్స్‌ చేయొద్దని హితవు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

రొటేటింగ్‌ కార్న్‌ ఛాలెంజ్‌ గురించి మీరు వినే ఉంటారు. డ్రిల్‌ మెషిన్‌కు మొక్కజొన్న గుచ్చి దానిని ఆన్‌ చేస్తారు. అది తిరుగుతుంటే నోటితో మొక్కజొన్న తినడం ఈ ఛాలెంజ్‌లో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఛాలెంజ్‌లు చేసి ఎంతో మంది యూట్యూబర్లు పళ్లు రాలగొట్టుకున్నారు కూడా. కానీ తాజాగా ఓ చైనా యువతి అటువంటి ప్రయత్నమే చేసింది. కానీ ఈ సారి ఆమె నోట్లోని పళ్లకు బదులు నెత్తిమీద జుట్టును పోగొట్టుకుని లబోదిబోమంటూ ఏడవసాగింది. ఈ రోజుల్లో ఇలాంటి వైరల్ వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తానూ అలాంటి ప్రయత్నమే చేయబోయింది. కానీ కథ అడ్డం తిరిగడంతో అది కాస్తా బెడిసి కొట్టింది. ఈ వీడియోలో సదరు యువతి డ్రిల్ మెషిన్‌లో మొక్కజొన్న అమర్చి.. స్విచ్‌ ఆన్‌ చేస్తుంది. తర్వాత తన నోట్లో పళ్లతో దాన్ని కొరకడానికి ప్రయత్నిస్తుంది. అంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే జరగకూడనిది జరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇంతలో ఆమె తల వెంట్రుకలు కొన్ని మొక్కజొన్నతో పాటు డ్రిల్ మిషన్‌లో ఇరుక్కు పోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపు ఆమె తలపై జుట్టు డ్రిల్ మెషిన్‌ లాగేస్తుంది. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత జుట్టు ఊడిన భాగంలో రక్తస్రావం అవుతుంది. బాధతో ఆమె తల పట్టుకోవడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పీపుల్ విత్‌ జీరో ఐక్యూ అనే యూజర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో వేలల్లో వీక్షణలు, కామెంట్లు, లైకులు వచ్చాయి. దీంతో అదికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకే పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలంటూ పలువురు నెటిజన్లు హితబోధ చేయగా.. మరికొందరేమో నవుతున్న ఎమోజీలను పోస్టు చేస్తూ బ్రెయిల్‌ మోకాలిలో ఉందా ఏంటీ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదిఏమైనా ఇలాంటి స్టంట్స్‌ చేయడం ప్రమాదకరం. వీటిని ఇళ్లలో ఎవరూ ప్రయత్నించకండే..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.