Watch Video: షాకింగ్ ఘటన.. ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. ఎక్కడంటే?

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగు చూసింది.లగార్డియా ఎయిర్‌పోర్టులో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు గాయపడినట్టు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు.

Watch Video: షాకింగ్ ఘటన.. ఎయిర్‌పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు.. ఎక్కడంటే?
Laguardia Plane Collision

Updated on: Oct 02, 2025 | 3:37 PM

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగు చూసింది.లగార్డియా ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ప్రమాదవశాత్తు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. వైరల్‌ వీడియో ప్రకారం.. ఎయిర్‌పోర్టులోని ఒక గేటు వద్ద ఒక డెల్టా డీఎల్5047 విమానం ఆగి ఉండగా.. అదే టైంలో రన్‌వేపై ల్యాండ్ అయిన మరో డెల్టా డీఎల్5155 విమానం.. మొబటి విమానం ఆగిన ఆదే గేటు వైపు వెళ్లింది. దీంతో రెండు విమానం రెక్క మొదటి విమానం ముక్కు భాగానికి తగిలింది.

అయితే ల్యాండ్‌ అవుతున్న విమానం వేగంగా ఉండడంతో డీకోట్టగానే దాని రెక్క విరిగి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడికి గాయాలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. దీంతో వెంటనే గటనా స్థలానికి చేరుకున్న ఎయిర్‌పోర్టు సిబ్బంది. గాయపడిన ప్రయాణికుడిని హాస్పిటల్‌కు, మిగతా ప్రయానికులను టెర్మినల్‌కు తరలించారు.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ మారింది.ఈ ఘటననై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.