Viral Video: రింగ్‌లో ఫైట్‌ ఏంది బ్రో.. ఇది చూడండి.. WWE ఈవెంట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు!

న్యూజెర్సీలో జరిగిన WWE సమ్మర్‌స్లామ్‌లో ఇద్దరు మహిళ మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ఇద్దరు మహిళలు పరస్పరం జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. WWE ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు రింగ్‌లో జరిగే ఫైట్‌ను కాకుండా ఈ మహిళల ఫైట్‌ను చూడాల్సి వచ్చింది.

Viral Video: రింగ్‌లో ఫైట్‌ ఏంది బ్రో.. ఇది చూడండి.. WWE ఈవెంట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు!
Wwe

Updated on: Aug 04, 2025 | 8:27 PM

ఆదివారం న్యూజెర్సీలో జరిగిన WWE సమ్మర్‌స్లామ్‌లో ఇద్దరు మహిళా అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది. అక్కడ మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే రింగ్‌సైడ్ సమీపంలో ఉన్న ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో మాటా మాటా పెరిగి ఇద్దరి కొట్టుకోవడం స్టార్ట్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని లాగుతూ గొడవ పడ్డారు. పక్కనున్న వారు వాళ్లను ఆపడానికి ఎంత ప్రయత్నించినా వారు అస్సలు తగ్గేది లేదు అన్నట్టు గొడవ పడుతూనే ఉన్నారు. అయితే దీన్ని గమనించిన అక్కడున్న బౌన్సర్స్‌ వాళ్లను ఆపడానికి ప్రయత్నించేలోపే పక్కను ఇతర ప్రేక్షలు వాళ్ల ఇద్దరిని గొడవపడకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో ప్రకారం.. అక్కడ ఫైట్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు రింగ్‌ జరుగుతున్న ఫైట్‌ను వదిలేసి వీళ్ల గొడవను చూడం స్టార్ట్‌ చేశారు. దీంతో అక్కడున్న భద్రతా సిబ్బంది గొడవ పడుతున్న ఇద్దరిని పట్టుకొని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఎరుపు రంగు స్కర్ట్ ధరించిన ఒక మహిళ తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ఒక పురుష అభిమానిని తన్ని కోపంగా చూపిస్తూ కనిపించింది. అయితే అసలు ఈ గొడవ ఎందుకు జరిగిందో అనేది ఇప్పటికి స్పష్టంగా తెలియదు.

అయితే 2025 WWE సమ్మర్‌స్లామ్ అనేది 38వ వార్షిక సమ్మర్‌స్లామ్. ఈ మ్యాచ్‌లో WWEకి చెందిన రా, స్మాక్‌డౌన్ బ్రాండ్‌లకు చెందిన రెజ్లర్స్‌ పాల్గొన్నారు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను చూసేందుకు భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.