Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!
అరబ్ దేశాల్లో నేరాలకు శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయంటే.. అక్కడ నేరం చేయాలంటే, తన జీవితంపై ఆశ వదిలేసుకోవాల్సిందే..! అరబ్ దేశాల్లో ఒకటైన ఒక్క సౌదీ అరేబియాలోనే ఈ ఏడాది 217 మందికి ఉరిశిక్ష పడింది. నిరుడు 345 మందిని ఉరి తీసిన ఆ దేశ ప్రభుత్వం.. ఈ ఏడాది చివరి నాటికి నిరుటి సంఖ్యను దాటటం ఖాయంగా కనిపిస్తోంది.
1990ల ప్రారంభంలో అధికారిక రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికమని, ఈ విషయంలో సౌదీ తీరు మార్చుకోవాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం డ్రగ్స్ రవాణా మీద ఉక్కుపాదం మోపుతోంది. ఆ దేశంలో 2022లో 19 మంది డ్రగ్స్ అక్రమ రవాణా దారులకు ఉరి శిక్ష పడగా, 2024 నాటికి ఆ సంఖ్య 117కి పెరిగింది. ఈ ఏడాది అదే తరహా నేరాలకు 144 మందికి మరణశిక్ష విధించింది. ఉరి తీస్తున్న వారిలో ఎక్కువ శాతం విదేశీయులే ఉంటున్నారు. ఒక్క జూన్ నెలలోనే డ్రగ్స్ కేసులో ఆ దేశం 37 మందిని ఉరితీసింది. వీరిలో ఈజిప్ట్,ఇథియోపియా, జోర్డాన్, నైజీరియా, పాకిస్తాన్, సోమాలియా, సిరియా దేశస్థులే 34 మంది ఉన్నారని ఆమ్నెస్టీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నమోదైన 217 మరణశిక్షలలో 96మంది సౌదీ పౌరులేనని కూడా ఆ రిపోర్ట్ పేర్కొంది. డ్రగ్స్ కట్టడి మంచిదేనని, కానీ, అత్యంత అరుదైన నేరాలకు విధించే ఉరిశిక్షను చిన్న చిన్న నేరాలకూ విధించటం తగదని సౌదీ అరేబియా తీరుపై మానవహక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి
Ghaati: దిక్కులేకుండా ఘాటి ?? ఈ తొందరపాటు నిర్ణయాలు ఎందుకు ??
ఒక్క డైలాగ్ దెబ్బకు రిలీజ్ ఆగిపోయిన యోగి సినిమా! అలుపెరగకుండా పోరాడుతున్న టీం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

