Viral Video: ఆకాశహర్మ్యంలో ఎగసి పడిన మంటలు.. తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది..

|

Jun 27, 2023 | 1:49 PM

నగరంలో ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ బిల్డింగ్ లో ఏర్పడిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు పబ్లిక్ సెక్యూరిటీ, పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమించాయి. చివరి అత్యంత కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Viral Video: ఆకాశహర్మ్యంలో ఎగసి పడిన మంటలు.. తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది..
Uae Viral Video
Follow us on

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రముఖ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అజ్మాన్ నగరంలోని ఓ ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ బిల్డింగ్‌లోని కొన్ని అంతస్తులకు మాత్రమే అగ్ని ప్రమాదం జరగలేదని.. అగ్ని మొత్తం బిల్డింగ్ ని దహించినదని.. భవనం మొత్తం నిప్పుల బంతులా మారిపోయిందని వీడియోలు చూస్తే తెలుస్తోంది. భవనం కింది అంతస్తు నుంచి పై అంతస్తు వరకు మంటలు వ్యాపించినట్లు కనిపిస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది.. తమ ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేయడానికి రంగంలోకి దిగాయి.

ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. నగరంలో ఎత్తైన భవనాల్లో ఒకటైన ఈ బిల్డింగ్ లో ఏర్పడిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు పబ్లిక్ సెక్యూరిటీ, పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమించాయి. చివరి అత్యంత కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భవనంలోని నివాసితులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. సమీపంలోని అజ్మాన్, షాజాలోని హోటళ్లకు తరలివెళ్లారు.

ఇవి కూడా చదవండి

భారీగా ఎగసి పడుతున్న ఆకాశహర్మ్యంలోని మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. ఎత్తైన భవనం కావడంతో భవనం పైభాగంలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది  తీవ్ర అవస్థలు పడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భవనం పై భాగం నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సమయంలో భవనం వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు తమ మొబైల్స్ కు పని చెప్పారు. ఎగసి పడుతున్న మంటలను తమ ఫోన్స్ లో రికార్డ్ చేశారు. అయితే భవనంలో మంటలు ఎలా చెలరేగాయి.. దీనికి గల కారణాలు ఏమిటి అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..